ఉగ్రవాదులతో సంబంధాలు, నిషేధిత లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు ( Hizbollah ) నిధులు సమకూర్చాడన్న అభియోగాలపై యూకేలో భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మేరకు లండన్ మెట్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
నిందితుడిని 66 ఏళ్ల సుందర్ నాగరాజన్‌గా( Sundar Nagarajan ) గుర్తించారు.హేస్ యూబీ3కి చెందిన సుందర్‌ను అమెరికాకు అప్పగించేందుకు గాను వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
నేషనల్ ఎక్స్‌ట్రాడిషన్ యూనిట్ అధికారులు.అంతర్జాతీయ వారెంట్ ఆధారంగా అతనిపై చర్య తీసుకున్నారు.
అమెరికా అధికారుల అభ్యర్ధన మేరకు పశ్చిమ లండన్( London ) నుంచి నాగరాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
భారత్‌లోని తమిళనాడు రాష్ట్రం మధురైలో జన్మించిన సుందర్ నాగరాజన్‌ను అలియాస్ కాశీ విశ్వనాథన్ నాగ అలియాస్ నాగరాజన్ సుందర్ పూంగులం అని కూడా పిలుస్తాను.
ఇతను ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు నిధులు సమకూర్చేందుకు మనీలాండరింగ్ అవతవకలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.అప్పగింత ప్రక్రియకు సంబంధించి ఏప్రిల్ 25న నాగరాజన్‌ను వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు.

తీవ్రవాదులకు ఫైనాన్సింగ్ చేస్తున్న వారిపై యూకే, యూఎస్ సమన్వయ చర్యల్లో భాగంగా మెట్ పోలీస్ అనుబంధ కౌంటర్ టెర్రరిజం కమాండ్ అధికారులు నజీమ్ అహ్మద్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.లెబనీస్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లాకు నిధులు సమకూర్చేందుకు గాను నజీమ్ తన కంపెనీల ద్వారా మనీలాండరింగ్ నేరాలకు పాల్పడ్డాడు.ఈ క్రమంలో అతని కంపెనీలకు ఇంటర్నేషనల్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నాగరాజన్ సాయం చేసినట్లుగా అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు.

నజీమ్ అహ్మద్ ఒక ఆర్ట్ కలెక్టర్, డైమండ్ డీలర్‌తో కూడా సంబంధాలు కలిగి వున్నాడని.హిజ్బుల్లాకు నిధుల వనరుగా మారాడాని అమెరికా ఆరోపిస్తున్నట్లు మెట్ పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో యూకే, యూఎస్‌లు నజీమ్ అహ్మద్, అతని సహచరులకు వ్యతిరేకంగా ఆంక్షలు ప్రకటించాయి.







