కోలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన సత్యప్రియ( Satya priya )కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఈ నటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
నరసింహ సినిమా ( Narasimha movie )గురించి సత్యప్రియ మాట్లాడుతూ సౌందర్యతో( Soundarya ) అంతగా ఇంటరాక్షన్ ఉండేది కాదని కామెంట్లు చేశారు.రమ్యకృష్ణ( Ramya Krishna )తో ఎక్కువగా నేను పని చేశానని ఆమె చెప్పుకొచ్చారు.
రమ్యకృష్ణ సొంతంగా రెడీ అయ్యేవారని హెయిర్ డ్రెస్సింగ్ కూడా చేసుకునేవారని సత్యప్రియ కామెంట్లు చేశారు.
సౌందర్య ఫేస్ పై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్ గురించి సత్యప్రియ మాట్లాడుతూ సెట్ లో వాళ్లిద్దరూ నార్మల్ గానే ఉండేవారని నార్మల్ గానే ఆ సీన్ చేసినట్టు ఆమె తెలిపారు.
రమ్యకృష్ణ జోవియల్ గా ఉండేవారని సత్యప్రియ చెప్పుకొచ్చారు. నాని( Nani ) సినిమాలు అన్నీ నచ్చుతాయని నాని డౌన్ టు ఎర్త్ ఉంటాడని ఆమె పేర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో మహేష్ సినిమాలు ఎక్కువగా చూడలేదని సత్యప్రియ వెల్లడించారు.

బన్నీ యాక్టింగ్, డ్యాన్స్ నాకు చాలా ఇష్టమని ఆమె పేర్కొన్నారు.అమ్మ, అమ్మమ్మ పాత్రల్లో ఛాన్స్ వస్తే చేయడానికి అభ్యంతరం లేదని సత్యప్రియ పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల్లో నాకు స్నేహితులు, బంధువులు ఉన్నారని అవకాశాలు వస్తే తెలుగు సినిమాలలో నటించడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఆఫర్లు అడగటం నాకు నచ్చదని ఆమె కామెంట్లు చేశారు.

నా ఫ్యామిలీకి అవసరమైన స్థాయిలో సంపాదించానని సత్యప్రియ అన్నారు.బాబు అమెరికాలో అమ్మాయి లండన్ లో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.నాకు ఎక్కువ ఆశలు లేవని కంఫర్ట్ కు ప్రాధాన్యత ఇస్తానని సత్యప్రియ వెల్లడించారు.
నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శకులకు థ్యాంక్స్ అని ఆమె తెలిపారు.సత్యప్రియ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.







