ఎన్నో టీవీ సీరియల్స్ లో నటిస్తూ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్న నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈమె రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఒకవైపు హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్నారు.తెలుగులో సీతారామం (Sitaramam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని, మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం నాని(Nani) హీరోగా నటిస్తున్న సినిమాలో మృణాల్ నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమా కోసం ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న నయనతార, సమంత వంటి వారు ఒక్క సినిమాకు ఆరు కోట్ల కంటే తక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
అయితే ఈమె ఈ హీరోయిన్లను బీట్ చేస్తూ ఏకంగా నాని సినిమా కోసం 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినప్పటికీ నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈమె అడిగిన మొత్తంలో ఇవ్వడానికి సిద్ధమయ్యారట.

ఇలా ఒక్క సినిమాతోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న మృణాల్ తదుపరి సినిమాకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచారని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సెల్ఫీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన ఈ బ్యూటీ ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారట.అయితే ఈమెకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినప్పటికీ నిర్మాతలు కూడా ఆమె అడిగినది మొత్తం ఇవ్వడానికి ఏమాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో తన క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.