అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుసగా వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉండే అనసూయ(Anasuya) సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) సిటాడేల్ ప్రమోషన్లలో భాగంగా స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడుతున్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
ఈ వీడియోని షేర్ చేసిన అనసూయ తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు.
నా ఉద్దేశం కూడా ఇదే ఇంట్లో అందరూ ఒక టీమ్ గా పనిచేయడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, అర్థం చేసుకోవడం వంటివి ఎంతో అవసరం.చాలా కుటుంబాలలో ఇలాంటివి కనిపించడం లేదు.ఒకవేళ కనిపించిన వారిపై దారుణమైన ట్రోల్స్ చేస్తుంటారు.
అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే ఈ ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని ఇలాంటి విషయాలను పిల్లలకు కూడా తెలియజేయాలి అంటూ అనసూయ తెలియచేశారు.అయితే ఈ వీడియో నెటిజన్ కామెంట్ చేస్తూ కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు.
మేడమ్ కుటుంబాన్ని పోషించే తన భార్యకు ఎలా వండి పెట్టాలో మీ పిల్లలకు నేర్పించండి… వచ్చే భార్య డబ్బు సంపాదిస్తుంది కనుక ఇంటి పనులను ఎలా చక్క పెట్టాలో పిల్లలకు నేర్పించండి అంటూ కామెంట్ చేశారు.ఈ కామెంట్ పై స్పందించిన అనసూయ సదురు నెటిజన్ కు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.తప్పకుండా నేర్పిస్తాను 11 సంవత్సరాల మా అబ్బాయి నాకు వంట పనులలో సహాయం చేస్తారు.ఇంటి పనులే కాదు కుటుంబాన్ని ఎలా పోషించాలో నా పిల్లలకు ఇప్పటినుంచి నేర్పిస్తున్నాను.
నా కుమారుడు అతనికి వచ్చే భార్య ఎలా జీవించాలో వారికి తెలుసు.ఇతరుల జీవితాలలో జోక్యం చేసుకోకుండా మన పనిపై ఫోకస్ పెట్టాలి.
ఇదే కదా అసలు సమస్య అందుకే మీ పని మీరు చూసుకోండి అంటూ అనసూయ ఘాటుగా రిప్లై ఇవ్వడంతో సదరు నెటిజన్ ట్వీట్ డిలీట్ చేశారు.