విరూపాక్ష సినిమాతో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి ధరం తేజ్( Sai Dharam Tej, ) తన నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.ఆల్రెడీ సెట్స్ మీద పవన్ తో వినోదయ సీతం ఉండగా తన తర్వాత సినిమా డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకున్నాడు.
ఇంతకీ సాయి ధరం తేజ్ నెక్స్ట్ చేస్తున్న డైరెక్టర్ ఎవరంటే చరణ్ తో రచ్చ చేసిన సంపత్ నందితో అని తెలుస్తుంది.ఏమైంది ఈవేళ సినిమా తో హిట్ అందుకుని చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నంది ఆ తర్వాత ఎందుకో క్లిక్ అవలేకపోయాడు.
రవితేజతో బెంగాల్ టైగర్, గోపీచంద్ తో గౌతం నందా, సీటీమార్( Seetimaarr ) సినిమాలు చేసిన సంపత్ నంది మధ్యలో నిర్మాతగా కూడా ప్రయత్నాలు చేశారు.ఫైనల్ గా సాయి ధరం తేజ్ తో సినిమా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.సంపత్ నంది సాయి ధరం తేజ్ క్రేజీ కాంబో మెగా ఫ్యాన్స్ కి మంచి మాస్ మసాలా సినిమా ఇస్తారని చెప్పొచ్చు.విరూపాక్ష( Virupaksha ) తర్వాత పవన్ సినిమా జూలై 28న రిలీజ్ ప్లాన్ చేయగా ఆ సినిమా తర్వాత సంపత్ నంది సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.