కెనడా ముంగిట పెను ముప్పు.. వ్యవసాయ రంగంలో వేధిస్తోన్న కార్మికుల కొరత

కరోనా వైరస్, లాక్‌డౌన్ ఇతరత్రా కారణాల వల్ల కెనడా ( Canada ) ఇప్పుడు కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.తాజాగా ఈ జాబితాలో అక్కడి వ్యవసాయ రంగం( Agri Sector ) కూడా చేరినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

 Canada Needs 30000 New Immigrants In Agri Sector Details, Canada ,30000 New Immi-TeluguStop.com

దీని నుంచి గట్టెక్కాలంటే 30 వేల మంది శాశ్వత వలసదారులు కావాలని నిపుణులు చెబుతున్నారు.రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా (ఆర్‌బీసీ) నివేదిక ప్రకారం.2033 నాటికి కెనడియన్ ఫార్మ్ ఆపరేటర్లలో 40 శాతం పదవీ విరమణ చేయనున్నారు.ఇది రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి శరాఘాతంగా చెబుతున్నారు.

అదే సమయంలో 24 వేలమంది సాధారణ వ్యవసాయ, నర్సరీ, గ్రీన్‌హౌస్ విభాగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందని అంచనా.

ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న నిర్వాహకులలో 60 శాతం మంది 65 ఏళ్లకు పైబడిన వారేనని నివేదికలు చెబుతున్నాయి.

వీటితో పాటు 66 శాతం మంది ఉత్పత్తిదారులకు వారసత్వ ప్రణాళిక లేదని, దీని వల్ల వ్యవసాయ భూముల భవిష్యత్తు సందేహాస్పదంగా మారుతుందని అధ్యయనం తెలిపింది.కెనడా వ్యవసాయ రంగం ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన వాటిలో ఒకటి.

ఇక్కడ విదేశీ కార్మికులు అత్యధికంగా పనిచేస్తున్నారు.భారత్, నెదర్లాండ్స్, చైనా, అమెరికా, యూకే దేశాలకు చెందిన వ్యవసాయ కార్మికులకు కెనడా ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే వుంది.

Telugu Agri, Canada, Canada Labor-Telugu NRI

అయితే ఈ రంగంలో కార్మికుల కొరతను( Labor Shortage ) ఎదుర్కోవడానికి వలసల విషయంలో మెరుగైన విధానాలు అవసరమని నివేదిక చెబుతోంది.తాత్కాలిక విదేశీ వర్కర్స్ (టీఎఫ్‌డబ్ల్యూ) కార్యక్రమం దీర్ఘకాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని అధ్యయనం తెలిపింది.దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టని పక్షంలో దేశంలో వ్యవసాయ శ్రామిక శక్తి గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే తాత్కాలిక విదేశీ వర్కర్స్ కార్యక్రమం అనుభవజ్ఞులకు మాత్రం ప్రయోజనం చేకూరుస్తుందని.

అంతేకాకుండా కార్మికుల కొరతను కూడా పరిష్కరిస్తుందని నివేదిక తెలిపింది.

Telugu Agri, Canada, Canada Labor-Telugu NRI

కెనడా 2020లో agriculture-specific immigration pilot programmeను ప్రారంభించింది.దీని ద్వారా అనుభవం వున్న నాన్ సీజనల్ కార్మికులకు శాశ్వత నివాస హోదా అందించింది.ఈ కార్యక్రమం వచ్చే మే నెలతో ముగియనుంది.

ఫిబ్రవరి 2023 నాటికి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒట్టావా ప్రావిన్స్‌లో 1500కు పైగా కార్మికులు ప్రవేశించారు.అయితే వలసదారులకు శాశ్వత నివాసం కల్పించడం కార్మికుల కొరతకు పరిష్కారం కాదని మరికొందరి వాదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube