రెండు వారాల్లో కోటి బీర్లు సేల్.. ఎక్కడో తెలుసా..?

వేసవి( summer ) తాపం మాములు ప్రజలకే శీతల పానీయాలు తాగాలని అనిపిస్తుంది.ఇక మందుబాబులకు ఈ మండుటెండల తాకిడి తట్టుకోవాలంటే చల్లటి బీరు( Cold beer ) పడాల్సిందే అని అనుకుంటారు.

 Record Beer Sales In Hyderabad City , Beer Sales ,hyderabad , Beer ,summer , S-TeluguStop.com

ఏప్రిల్ నెలలో ఎండలు బాగా ఉంటున్నాయి.ప్రజలు బయటకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు.

భానుడు భగ భగ మండుతున్న తరుణంలో మందుబాబులు బీర్లు ఓ రేంజ్ లో తాగేస్తున్నారు.ఏప్రిల్ నెలలో 17 రోజుల్లోనే హైదరాబాద్ లో 1.01 కోట్ల బీర్లు సేల్ అయినట్టు ఎక్సైజ్ శాఖ ( Excise Department )నుంచి వస్తున్న సమాచారం.

Telugu Beer, Beer Sale, Excise, Hyderabad, Season, Telangana-Latest News - Telug

17 రోజుల్లో కోటి బీర్లు అంటే అది సాధారణమైన విషయం కాదు.గ్రేటర్ పరిధిలో ఉన్న మూడు జిల్లాల్లో మొత్తం 8,46,175 కేసుల బీర్లు విక్రయించారని తెలుస్తుంది.ఒక కేసులో 12 బీర్లు ఉండగా వీటిని బట్టి చూస్తే దాదాపు కోటి బీర్లు దాకా అమ్ముడైనట్టు తెలుస్తుంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు ప్రతిరోజు 6 లక్షల బీర్లు సేల్ అవుతున్నాయట.హైదరాబాద్ లోనే ఈ రేంజ్ లో అమ్మకాలు అయ్యాయి అంటే మిగతా జిల్లాల్లో ఈ లెక్క మించేలా ఉంటుందని చెప్పొచ్చు.

అంతేకాదు ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మేలో ఎండ తీవ్రత మరింత ఉంటుంది ఈ లెక్కన చూస్తే వచ్చే నెలలో బీర్ల అమ్మకాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube