నిన్న అనగా ఏప్రిల్ 18, మంగళవారంనాడు దేశంలోనే తొలి ఆపిల్ స్టోర్ సంస్థ సీఈవో టిమ్ కుక్( CEO Tim Cook ) చేతుల మీదుగా ప్రారంభం అయింది.ఈ సందర్భంగా ఓ అరుదైన దృశ్యం ఆయనతోపాటు నెటిజన్లను ఆశ్చర్య పరిచింది.
విషయం ఏమంటే, 1984 నాటి ఆపిల్ వింటేజ్ కంప్యూటర్( Apple Vintage Computer ) తో ఓ అభిమాని ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చారు.ఆపిల్ స్టోర్ ఓపెనింగ్ టైంలో ఈ దృశ్యం కనిపించగా నెటిజనులు కూడా ఒకింత ఆశ్చర్య పోయారు.

కాగా ఆయనని చూసేందుకు, ఆయనతో ఫొటోలు దిగిందుకు చాలా మంది ఆపిల్ ఫోన్ యూజర్లు ఆ ప్రాంతానికి చేరుకోవడం విశేషం.తనను చూసేందుకు ఫొటోలు తీగేందుకు వస్తున్న అభిమానులతో సరదగా మాట్లాడారు.ఇంతలో అక్కడకు ఓ పెద్ద బాక్స్ తో ఓ సందర్శకుడు వచ్చారు.ఆయన చేతిలో ఉన్న పాత కంప్యూటర్ ని చూసి కుక్ ఆశ్చర్యపోయారు.వావ్ అంటూ అతగాడిని హత్తుకున్నారు.ఆపిల్ జర్నీ తెలియజేసేందుకే ఈ వింటేజ్ కంప్యూటర్ ని తీసుకొచ్చినట్టు ఆ యూజర్ ఈ సందర్భంగా చెప్పడం విశేషం.

ఈ సందర్భంగా అతగాడు అనేక విషయాలు మీడియాతో మాట్లాడాడు.1984 నుంచి ఆపిల్ ప్రోడెక్ట్స్ తాను వాడుతున్నట్టు చెప్పుకొచ్చాడు.ఇది 2 మెగా బైట్స్ బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ అని ఇప్పుడు ఆపిల్ సంస్థ 4కే, 8కే రెజల్యూషన్ డిస్ప్లేలు తయారు చేస్తుందన్నారు.కాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, నాణ్యమైన ఆపిల్ ఉత్పత్తులను అమ్మే ఈ స్టోర్ ని చాలా నిరాడంబరంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేళతాళాలు, రిబ్బన్ కటింగ్స్ లాంటివి ఏమి పెట్టుకోలేదు.నలుపు రంగు టీ షర్ట్ వేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చిన టిమ్ కుక్, సింపుల్ గా బీకేసీ యాపిల్ స్టోర్ గేట్ను తెరిచి పట్టుకోవడంతో స్టోర్ లాంచ్ అయింది.







