సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో సావిత్రి( Savitri ) ఒకరు.ఈతరం ప్రేక్షకులలో కూడా సావిత్రి నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే సావిత్రి ఆస్తులు కోల్పోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.ఆమె ఆస్తులు పోగొట్టుకోవడానికి సంబంధించి వేర్వేరు కథలు ప్రచారంలో ఉన్నాయి.
తమిళ నటి సత్యప్రియ( Actress Satyapriya ) ఒక ఇంటర్వ్యూలో సావిత్రి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సత్యప్రియ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎస్పీ బాలు( SP Balu ) గారు అంటే చాలా అభిమానమని కరోనా సమయంలో బాలు గారు మరణించడంతో చివరి చూపు చూడటానికి వెళ్లలేదని ఆమె తెలిపారు.నా పిల్లలు కూడా బయటి దేశాల్లో ఉన్నారని నాకు ఏదైనా జరిగితే వాళ్లు అప్పుడు ఇక్కడికి రాలేరని చివరి చూపు చూడకపోవడానికి ఎవరి రీజన్స్ వాళ్లకు ఉంటాయని సత్యప్రియ కామెంట్లు చేశారు.

సెలబ్రిటీలు అప్పుల పాలు కావడానికి వాళ్లకు చదువు, సరైన గైడెన్స్ లేకపోవడం కారణమని ఆమె చెప్పుకొచ్చారు.మహానటి సావిత్రిగారు అంటే నాకు చాలా ఇష్టమని ఆవిడకు అలా జరగడం జీర్ణించుకోలేమని సత్యప్రియ పేర్కొన్నారు.సావిత్రి అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఆమె డబ్బులు పోగొట్టుకున్నారని సత్యప్రియ చెప్పుకొచ్చారు.
నేను కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా నటించానని ఆమె తెలిపారు.

తెలుగులో నాగార్జున( Nagarjuna )తో అగ్ని సినిమాలో నటించానని సత్యప్రియ వెల్లడించారు.స్నేహమంటే ఇదేరా సమయానికి నేను కూడా స్టార్ కావడంతో నాగ్ తో బాగా మాట్లాడేదానినని ఆమె చెప్పుకొచ్చారు. ప్రత్యూష( Pratyusha ) బాగా క్లోజ్ అని ఆమె మరణం బాధ పెట్టిందని సత్యప్రియ వెల్లడించారు.
ప్రత్యూష చనిపోయిన సమయంలో చాలా బాధ వేసిందని ఆమె అన్నారు.సత్యప్రియ సావిత్రి, ప్రత్యూష గురించి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.







