అవును మీరు విన్నది నిజమే.కాలిఫోర్నియాలోని( California ) నాసా సైంటిస్టులు ప్రస్తుతం గ్రహాంతర వాసులను కనుగొనే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే రోబోటిక్ స్నేక్‌ను ఒకదానిని డెవలప్ చేస్తున్నారు.ఎక్సోబయాలజీ ఎక్స్‌టాంట్ లైఫ్ సర్వేయర్ సిస్టమ్ పేరుతో నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో ఈ స్నేక్ మెరుగులు దిద్దుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ పొడవాటి రోబో స్నేక్ ( Robot Snake )తన చక్రాల ఆధారంగా ప్రపంచపు భూభాగమంతా చుట్టుముట్టి వచ్చేలా దాన్ని డిజైన్ చేయడం విశేషం.ఇక దాని ప్రాథమిక లక్ష్యం ఏంటంటే.
శని గ్రహంకు సంబంధించిన ఉపగ్రహం ఎన్సెలాడస్‌పై ఉన్న బిలాలను సందర్శించడం.

అవును, ఇది భూభాగంపై ప్రతీ విషయాన్ని క్యాప్చర్ చేసే రోబో స్నేక్ అని మనం ఇక్కడ అర్ధం చేసుకోవచ్చు.అది తన జర్నీలో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులను కూడా సవాలు చేస్తూ నావిగేట్ చేయడం మరో విశేషం.ఇది ట్రెడీషనల్ రోవర్ వెహికల్స్ మాదిరిగా కాకుండా EELS పగుళ్లను క్రాల్ చేయడం ద్వారా, నీటిలో ఈదడం ద్వారా భిన్నమైన పరిసరాలను పరిశోధించగలుగుతుంది కూడా.
దీని ప్రాజెక్ట్ మేనేజర్ అయినటువంటి డామార్టిన్ రాబిన్సన్ చంద్ర లావా( Damartine Robinson Lunar lava ) ఈ రోబో స్నేక్ ట్యూబ్‌లలోకి దిగి కూడా ఏదైనా ప్రదేశాన్ని అన్వేషించగలదని ఊహించాడు.

ఆ ఊహే నేడు రోబో స్నేక్ రూపం దాల్చుతోంది.ఇది గ్రహాలలోని భిన్నమైన అనలాగ్ వాతావరణంలో ఈఈఎల్‌ఎస్ సామర్థ్యాలను సైతం ప్రదర్శించగలుగుతుంది.అధిక ప్రభావితం కలిగిన భూ సంబంధమైన శాస్త్రీయ పరిశోధనలను గుర్తించడానికి జేపీఎల్ ప్రస్తుతం ఎర్త్ సైంటిస్టులకు సహకరిస్తుందనే విషయం విదితమే.
కెనడాలోని అథాబాస్కా హిమానీనదం, మౌంట్ మీగర్ అగ్నిపర్వతం లోపల దీని పనితీరును నిపుణులు పరీక్షించారు.ఇదొక అద్భుతమైన ముందడుగు అని డాక్టర్ మార్టిన్ రాబిన్ సన్ అన్నారు.







