యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం లో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర లో కనిపించబోతున్న విషయం తెలిసిందే.తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు.
రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్న రెండవ షెడ్యూల్ కి సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) జాయిన్ అయ్యాడు.
అందుకు సంబంధించిన ఫోటోలు మరియు ఇతర విషయాలను చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేయడం జరిగింది.ఇక ఈ సినిమా లో నటిస్తున్నందుకు గాను సైఫ్ ఏకంగా ఐదు కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడని.దాంతో పాటు బాలీవుడ్ లో విడుదల అవ్వగా వచ్చే లాభాల్లో వాటా ను కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆయన స్థాయికి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అనేది చాలా తక్కువ.అయితే ఆయన బాలీవుడ్ రైట్స్ విషయం లో నమ్మకం పెట్టుకొని ఈ సినిమా కు కమిట్ అయినట్లుగా తెలుస్తుంది.తద్వారా కనీసం ఐదు కోట్ల రూపాయలైనా వచ్చే అవకాశం ఉంది.కనుక మొత్తం గా ఈ సినిమా ద్వారా పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ సైఫ్ అలీ ఖాన్ కి దక్కుతున్నట్లు భావించవచ్చు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ కి ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత బాలీవుడ్( Bollywood ) లో మంచి ఆదరణ పెరిగింది.అందుకే ఈ సినిమా కు అక్కడ భారీగా బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే సైఫ్ అలీ ఖాన్ హిందీ వర్షన్ లాభాలపై దృష్టి పెట్టాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.