కరోనా విపత్తు వలన అన్ని పరిశ్రమలకు నష్టం జరిగినట్టు ఏవియేషన్ ఇండస్ట్రీకి కూడా భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది.ఆ పరిస్థితులు అదుపులోకి వచ్చాక, గతేడాది కొన్ని దేశాలు ప్రయాణికుల కోసం నిబంధనలను సడలించడం జరిగిందే.
ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలని అనుకున్నవారు తమ ప్లాన్స్ షురూ చేశారు.కొందరు ఫ్లైట్ టిక్కెట్ల ధరలు తగ్గిన తర్వాత ట్రావెలింగ్ ప్లాన్ చేయాలని వాయిదా వేసుకున్నారు కూడా.
అయితే వరుసగా రెండో ఏడాది కూడా ఫ్లైట్ టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటడం కొసమెరుపు.
ఐరోపా( Europe )లో కొన్ని గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 40% నుంచి 60% వరకు పెరుగుతున్నట్టు కనబడుతోంది.ఏదిఏమైనా మనవాళ్ళు మాత్రం చాలా మంది తగ్గేదేలే అన్నట్టు విమానాల్లోనే ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు.ఓ ట్రావెల్ బుకింగ్ పోర్టల్ డేటా ప్రకారం.ముంబై నుంచి ప్యారిస్‌కి( Mumbai ) 15 నుంచి 30 రోజుల ముందుగా బుక్ చేసుకున్న వన్-వే ఎకానమీ ఎయిర్‌ఫేర్ ధర రూ.42,990.అదేవిధంగా ముంబై నుంచి రోమ్‌కి రూ.41,666 గా వున్నాయి.ఈ ధరలు గతేడాది రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉండగా ఇపుడు దాదాపు 37% పెరగడం గమనార్హం.
అదంతా ఒకెత్తయితే ఇక ixigo బుకింగ్స్ కూడా 20% పెరగడం ఇక్కడ గమనించవచ్చు.బుకింగ్‌లు పెరిగినప్పటికీ బెంగళూరు నుంచి దోహాకు టిక్కెట్ ధరలు 73 శాతం పెరిగాయి.అలాగే ముంబై నుంచి దోహాకి 49 శాతం పెరిగాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా జెట్ ఇంధన ధరలు(Jet Fuel Price ) పెరగడం, రూపాయి విలువ క్షీణించడం కూడా సమస్యకు కారణమని కొందరు అంటున్నారు.గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే అవుట్‌బౌండ్ ప్యాకేజీల కోసం బుక్ చేసిన యావరేజ్ నైట్స్ సంఖ్య 27% పెరిగింది.ఇది కరోనా మహమ్మారి కంటే ముందు కంటే 85% ఎక్కువ కావడం గమనార్హం.