ఫ్లైట్ ఛార్జీల మోతలు… వెనక్కి తగ్గని ఇండియన్ ట్రావెలర్స్!
TeluguStop.com
కరోనా విపత్తు వలన అన్ని పరిశ్రమలకు నష్టం జరిగినట్టు ఏవియేషన్ ఇండస్ట్రీకి కూడా భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది.
ఆ పరిస్థితులు అదుపులోకి వచ్చాక, గతేడాది కొన్ని దేశాలు ప్రయాణికుల కోసం నిబంధనలను సడలించడం జరిగిందే.
ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలని అనుకున్నవారు తమ ప్లాన్స్ షురూ చేశారు.కొందరు ఫ్లైట్ టిక్కెట్ల ధరలు తగ్గిన తర్వాత ట్రావెలింగ్ ప్లాన్ చేయాలని వాయిదా వేసుకున్నారు కూడా.
అయితే వరుసగా రెండో ఏడాది కూడా ఫ్లైట్ టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటడం కొసమెరుపు.
"""/" /
ఐరోపా( Europe )లో కొన్ని గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే 40% నుంచి 60% వరకు పెరుగుతున్నట్టు కనబడుతోంది.
ఏదిఏమైనా మనవాళ్ళు మాత్రం చాలా మంది తగ్గేదేలే అన్నట్టు విమానాల్లోనే ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు.
ఓ ట్రావెల్ బుకింగ్ పోర్టల్ డేటా ప్రకారం.ముంబై నుంచి ప్యారిస్‌కి( Mumbai ) 15 నుంచి 30 రోజుల ముందుగా బుక్ చేసుకున్న వన్-వే ఎకానమీ ఎయిర్‌ఫేర్ ధర రూ.
42,990.అదేవిధంగా ముంబై నుంచి రోమ్‌కి రూ.
41,666 గా వున్నాయి.ఈ ధరలు గతేడాది రూ.
25,000 నుంచి రూ.30,000 మధ్య ఉండగా ఇపుడు దాదాపు 37% పెరగడం గమనార్హం.
"""/" /
అదంతా ఒకెత్తయితే ఇక Ixigo బుకింగ్స్ కూడా 20% పెరగడం ఇక్కడ గమనించవచ్చు.
బుకింగ్‌లు పెరిగినప్పటికీ బెంగళూరు నుంచి దోహాకు టిక్కెట్ ధరలు 73 శాతం పెరిగాయి.
అలాగే ముంబై నుంచి దోహాకి 49 శాతం పెరిగాయి. """/" /
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా జెట్ ఇంధన ధరలు(Jet Fuel Price ) పెరగడం, రూపాయి విలువ క్షీణించడం కూడా సమస్యకు కారణమని కొందరు అంటున్నారు.
గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే అవుట్‌బౌండ్ ప్యాకేజీల కోసం బుక్ చేసిన యావరేజ్ నైట్స్ సంఖ్య 27% పెరిగింది.
ఇది కరోనా మహమ్మారి కంటే ముందు కంటే 85% ఎక్కువ కావడం గమనార్హం.
బడ్జెట్‌పై ఎన్ఆర్ఐల ఆశలు .. పన్ను చెల్లింపులపై భారత ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు