మొదటి సినిమా నుంచే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prashanth varma ) అ! సినిమా తో మంచి విజయం అందుకోవడం తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు…ఆ తర్వాత రాజా శేఖర్ తో తీసిన కల్కి,తేజ సజ్జా తో తీసిన జాంబీ రెడ్డి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.దింతో మరోసారి తేజ సజ్జా తో హనుమాన్( Hanuman ) అనే సినిమాని తీస్తున్నాడు.
ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.అంతేకాకుండా ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

తెలుగు సహా 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది.అందులో కొరియన్, జపనీస్, ఇంగ్లీష్, స్పానీష్, చైనీస్ భాషలు కూడా ఉన్నాయి.ఒక తెలుగు సినిమా ఇన్ని భాషల్లో రిలీజవడం ఇదే తొలిసారి.కంటెంట్ మీదున్న నమ్మకంతో భారీ ఎత్తున ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.నిజానికి ప్రశాంత్ వర్మ ఒక్క టీజర్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాడు.

సూపర్ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది.ఈ సినిమా లో వరలక్ష్మీ శరత్ కుమార్( Varalaxmi Sarathkumar ) కీలకపాత్ర పోషిస్తుంది.డాక్టర్ ఫేం వినయ్‌రాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.
ప్రైమ్ షో ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు.అయితే ఈ సినిమాకు హక్కులకు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది.కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనే ఈ సినిమాకు దాదాపు 10 కోట్లు వచ్చాయని తెలుస్తుంది…

హను మాన్ టీజర్ చుసిన తర్వాత అందరు ప్రశాంత్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరో రాజమౌళి అవుతాడు అని ఆయన టేకింగ్ గురించి చెప్పుకుంటున్నారు తక్కువ బడ్జెట్ లో అంత క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావడం చాలా కష్టం అని అది ఇప్పటి వరకు రాజమౌళి ఒక్కడికే సాధ్యం అయిందని ఆయన తర్వాత ప్రశాంత్ వర్మ కి కూడా గ్రాఫిక్స్ మీద మంచి నాలెడ్జ్ ఉందని అందుకే ఈ సినిమా ఔట్ ఫుట్ బాగుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు… ప్రశాంత్ వర్మ కూడా ఫ్యూచర్ లో రాజమౌళి స్థాయి డైరెక్టర్ అవుతాడు అని కూడా అంటున్నారు.సినిమా రిలీజ్ అయినా తర్వాత సినిమా అవుట్ ఫుట్ ని బట్టి ప్రశాంత్ వర్మ సినిమా ని ఎలా డీల్ చేసాడో చూడాలి అని మరి కొందరు అంటున్నారు ……
.







