బలగం మొగిలయ్యకు మెగాస్టార్ చిరంజీవి సహాయం.. మెగాస్టార్ దేవుడంటూ?

సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ముందువరసలో ఉంటారు.చేసిన సహాయాలను చెప్పుకోవడానికి చిరంజీవి అస్సలు ఇష్టపడరు.

 Chiranjeevi Helping Nature To Balagam Mogilayya Details, Balagam Mogilayya, Mega-TeluguStop.com

చిరంజీవి ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా చిరంజీవి బలగం మొగిలయ్యకు( Balagam Mogilayya ) ఆర్థిక సహాయం చేశారు.

మొగిలయ్య గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు.

బలగం మూవీలో( Balagam Movie ) మొగిలయ్య నా తోడుగా నీ తోడు ఉండి అనే పాటను పాడారు.

మొగిలయ్య ప్రస్తుతం వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.మొగిలయ్యకు కిడ్నీలు దెబ్బ తినడంతో పాటు కంటి సంబంధిత సమస్యలు కూడా వేధిస్తున్నాయి.చాలా సంవత్సరాల నుంచి ఆయన డయాబెటిస్ తో బాధ పడుతున్నారు.డయాబెటిస్ వల్ల ఆయనకు కంటి సమస్యలు వచ్చాయి.

అయితే మొగిలయ్య కంటి సమస్యల చికిత్సకు ఎంత ఖర్చైనా తాను భరిస్తానని బలగం డైరెక్టర్ వేణుకు చిరంజీవి హామీ ఇచ్చినట్టు సమాచారం.మొగిలయ్య దంపతులు ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.తెలంగాణ సర్కార్ సైతం మొగిలయ్యకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.మొగిలయ్య త్వరలో కోలుకుని సాధారణ మనిషి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చిరంజీవి గారు రియల్ హీరో అని కష్టాల్లో ఉన్న ఎంతోమందిని గుర్తించి ఆయన తన వంతు సహాయం చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.చిరంజీవి దేవుడిలా కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube