ఆయుర్వేదం వైద్యం అత్యంత పురాతనమైనది.దీనికి క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థరైటిస్, ఆస్తమా వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టే సామర్థ్యం ఉంది.
అయితే దీనిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయుర్వేద వైద్యులు భావిస్తున్నారు.సాంకేతికత సాయంతో ఆయుర్వేద వైద్య సేవలను మరింత మందికి అందించొచ్చని అనుకుంటున్నారు.
ముఖ్యంగా ఆయుర్వేద వైద్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) సాయంతో మరో స్థాయికి చేర్చాలని వైద్యులు ప్రణాళికలు రచిస్తున్నారు.దీని వల్ల చాలా ప్రయోజనాలున్నాయని ఆయుర్మేఘా ఆయుర్వేద ఆసుపత్రి ఎండీ చెన్నుబట్ల మూర్తి( MD Chennubatla Murthy ) అభిప్రాయపడ్డారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మకమైనదిగా పరిగణించబడుతోంది.ఇదే భవిష్యత్తును శాసిస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను ఆయుర్వేదానికి జోడించడం మంచి ఫలితాలను అందిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం ప్రజాదరణ పొందింది.తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్‌లతో ప్రజలను ఆకర్షిస్తోంది.అయితే ఎప్పటికప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలను తెలుసుకోవడం, ప్రజల అవసరాలు ఊహించడం అవసరం.
అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్‌లో ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయించడంలో పోటీ ఉంటుంది.అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కలిపి మార్కెట్ చేస్తే మంచి ఫలితాలొస్తాయనేది ఆయుర్వేద వైద్యుల భావన.
వైద్య, సౌందర్య సాధనాల విషయంలో ఆయుర్వేదానికి చాలా ప్రత్యేకత ఉంది.వాటిని ప్రజలకు చేరవేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు తీసుకుంటే మరింత ఎక్కువ మందికి దీనిని పరిచయం చేయొచ్చని చెన్నుబట్ల మూర్తి పేర్కొన్నారు.
టెలీ మెడిసిన్ సాయంతో ప్రపంచంలో ఏమూల ఉన్నా ఆయుర్వేద సేవలు అందించవచ్చు.అంతేకాకుండా ఆయుర్వేదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానిస్తే గుండె స్పందన, బ్లడ్ ప్రెషర్, నాడీ స్పందనలు, గుండె పనితీరు క్షణాల్లో తెలుసుకోవచ్చు.
దీంతో పాటు 2డీ ఇకో రిపోర్ట్‌ను కేవలం 2 నిమిషాల్లో పొందొచ్చు.ఫలితంగా ఆయా వ్యాధుల బాధితులకు సత్వరమే ఆయుర్వేదంలో వసరైన వైద్యం అందించవచ్చు.







