డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక రైలు ప్రయాణికులు చాలామంది ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు.దీనికి సాధారణంగా ఐఆర్‌సీటీసీ అనే వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు.
అయితే కొందరు సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా చేసుకొని ఆ వెబ్‌సైట్‌కి వున్న అదరణని క్యాష్ చేసుకోవాలని నకిలీ వెబ్‌సైట్లను క్రియేట్ చేస్తున్నారు.ఇదే క్రమంలో ఫేక్ యాప్స్( Fake apps ) కూడా విడుదల చేస్తున్నారు.
ఈ ఫేక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రయాణికుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని వారు దొంగిలిస్తున్నారు.ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే టికెటింగ్ పోర్టల్ ఐఆర్‌సీటీసీ తన యూజర్లను అప్రమత్తం చేసింది.

అవును, మీరు విన్నది నిజమే.ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్( Android smartphone ) యూజర్లకు ఐఆర్‌సీటీసీ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది.అదేమంటే, irctcconnect.apk అనే అనుమానాస్పద ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను పొరపాటున కూడా డౌన్‌లోడ్ చేయవద్దని ఐఆర్‌సీటీసీ తన యూజర్లకు విజ్ఞప్తి చేసింది.సైబర్ నేరగాళ్లు హానికరమైన యాప్ irctcconnect.apkను వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా షేర్ చేస్తున్నారని, వీటిపట్ల వినియోగదారులు చాలా జాగ్రత్త వహించాలని ఐఆర్‌సీటీసీ తన తాజా ప్రకటనలో హెచ్చరించింది.

ఈ యాప్ యూజర్ల మొబైల్ ఫోన్‌లోకి వైరస్ లేదా మాల్వేర్‌ను పంపి, తద్వారా యూజర్ల యూపీఐ( UPI ) వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కొల్లగొడుతోంది.ఫలితంగా యూజర్ల బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతోంది.కాబట్టి, యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని టికెటింగ్ పోర్టల్ కోరింది.ఇది ముఖ్యంగా ఇది వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యూజర్లకు చేరుతుందని పడే పడే అందులో పేర్కొంది.
యాప్ irctc.creditmobile.
site అనే ఫిషింగ్ వెబ్‌సైట్‌లో ఉందని, ఇది యూజర్ల మొబైల్ ఫోన్‌కు హాని కలిగించవచ్చని చెప్పుకొచ్చింది.







