వివేకానంద రెడ్డి( Viveka murder case ) హత్యకేసు ముగింపు దశకు వచ్చినట్టుగా కనిపిస్తుంది… ఇప్పటికే ఈ కేసులో అరెస్టులతో ముందుకు వెళ్తున్న సిబిఐ, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేసి మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.సిబిఐ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ వేశారు .
ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు సిబిఎస్ తరపు న్యాయవాదికి పలు ప్రశ్నలు సందించింది ….విచారణ తర్వాత అవినాష్ రెడ్డి( Y.S.Avinash Reddy )ని అరెస్టు చేస్తారా? అన్న ప్రశ్నకు సిబిఐ తరుపు న్యాయవాది అవసరమైతే అరెస్టు చేస్తామంటూ బదులిచ్చారు దీనిని బట్టి అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే సంకేతాలు సిబిఐ ఇచ్చినట్టయ్యింది.ఇప్పటికే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ల పేర్లను నిందితుల లిస్టులో చేర్చిన సిపిఐ తన వాదనకు బలం చేకూర్చే ఆధారాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది.
సిబిఐ తనను అనవసరంగా ఈ కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తుందని ,గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా తనను నిందితుడిగా చేర్చే ప్రయత్నం జరుగుతుందని, డబ్బులు ఇచ్చి దస్తగిరిని అప్రూవల్ గా మార్చారని ,సిబిఐ కూడా అతని స్టేట్మెంట్కే అదిక ప్రాధాన్యమిస్తుందంటూ , చివరికి న్యాయమే గెలుస్తుంది అంటూ అవినాష్ రెడ్డి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .
ఆయన వివేకానంద రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారి తీస్తున్నాయి స్త్రీలతో ఉన్న అక్రమ సంబంధాల వల్లే ఆయన హత్య జరిగిందన., రెండవ భార్యని ఆర్థిక వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల సునీతశకు( YS Sunitha ) తండ్రికి గొడవలు జరిగాయని , సిబిఐ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారాలను పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆరోపణ చేశారు.ఏది ఏమైనా హత్య కేసు విచారణ చివరి దశకు వచ్చిందని సిబిఐ తేల్చేసిన దరిమిలా ఈ కేసులో అసలు దోషలెవరో ప్రపంచానికి వెళ్లడయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.