ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్( NTR ) చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాను కొరటాల శివ( Koratala Siva ) డైరెక్ట్ చేస్తుండగా యువసుధ ఆర్ట్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ రెండు కలిసి నిర్మిస్తున్నారు.
సినిమాలో బాలీవుడ్ భామ జాన్వి కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఇక లేటెస్ట్ గా నేటి నుంచి సెకండ్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.ఎన్టీఆర్ తో పాటుగా ముఖ్య తారాగణం అంతా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది.రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమా విషయంలో తారక్ చాలా ఫోకస్ తో ఉన్నారు.

ఆర్.ఆర్.ఆర్ తో తనకు పాన్ ఇండియా క్రేజ్ రాగా ఆ తర్వాత చేస్తున్న సినిమాగా దీన్ని కూడా ఆ సినిమా రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివని నమ్మి తారక్ ఈ సినిమా చేస్తున్నారు.
ఆల్రెడీ ఇద్దరు జనతా గ్యారేజ్ లాంటి హిట్ సినిమా ఇచ్చారు కాబట్టి ఈ కాంబో మరోసారి అదే రిజల్ట్ అందుకుంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.







