ఆలస్యం అమృతం, విషం అంటారు పెద్దలు.కానీ ‘ఆలస్యం విషం, వేగమే అమృతం’ అని అంటాయి దేశంలోని ప్రముఖ డెలివరీ స్టార్టప్స్.
వారిదేముంది, అంతా బిజినెస్ స్ట్రాటజీ… అలా అనేసి ఊరుకుంటారు.కష్టపడాల్సింది దిగువస్థాయి ఉద్యోగులైనటువంటి డెలివరీ బాయ్స్ కదా.ఇదే మంత్రం వాటి పాలిట శాపం అవుతోంది.

కాలం పూర్తిగా మారిపోయింది.స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డర్ చేస్తే కుతకుతమనే వేడితో ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది.ఆర్డర్ చేసాక పట్టుమని పది నిమిషాలలో డెలివరీ తేకపోతే మనం ఊరుకోము కదా.అయితే బైక్ పంక్చర్ అయితేనో, ట్రాఫిక్ సిగ్నల్ పడొచ్చు లేదా ఇంకేమైనా జరగొచ్చు.అలాంటప్పుడు డెలివరీ బాయ్స్ కాస్త ఆలస్యంగా రావొచ్చు.

అలా వస్తే మనం ఊరుకోము సరే.డెలివరీ సంస్థలు అస్సలు ఊరుకోవు.అయితే అన్ని వ్యయప్రయాసలకు ఓర్చి పది నిమిషాల్లో డెలివరీ చేసే ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం అనేది దక్కుతుందా? అంటే లేదనే అంటున్నారు జొమాటో( Zomato )కి చెందిన ‘బ్లింకిట్( Blinkit )’ ఉద్యోగులు.బ్లింకిట్ యాప్‌కు చెందిన సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు.
ఈ క్రమంలో వారు డెలివరీ చేయడం మానేశారు.దీంతో ఆ సంస్థ దేశ వ్యాప్తంగా 400 స్టోర్ల నుంచి సర్వీసుల్ని అందిస్తుండగా.ఉద్యోగుల నిర్ణయంతో వాటిలో పదుల సంఖ్యలో స్టోర్లు మూత పడడం కొసమెరుపు.

మరోవైపు… సిబ్బంది ఆందోళన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటీవల బ్లింకిట్ కొత్త చెల్లింపుల పద్దతిని అమలు చేసిందని, ఆ నిర్ణయం వల్ల గతంలో డెలివరీ చేసిన ఆర్డర్లకు పొందే వేతనాలు పూర్తిగా తగ్గిపోయాయని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలోనే ఉద్యోగులకు జొమాటో మెయిల్ పెట్టింది.
ఆ మెయిల్‌లో రైడర్‌ల కోసం కొత్త చెల్లింపుల పద్దతిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది.ఈ పద్దతిలో చేసే డెలివరీల ఆధారంగా చెల్లింపులు ఉంటాయని, షట్‌డౌన్ చేసిన స్టోర్లను తిరిగి ప్రారంభించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసింది.







