గుణశేఖర్ మరో కృష్ణవంశీ, శ్రీను వైట్ల...!

ఒకప్పుడు చూడాలని ఉంది, ఒక్కడు వంటి ఎన్నో అద్భుత చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సక్సెస్‌ ఫుల్ దర్శకుడిగా నిలిచిన దర్శకుడు గుణశేఖర్( Gunashekhar ) ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది.ఆయన ఎనిమిది సంవత్సరాల క్రితం రుద్రమదేవి( Rudrama Devi ) చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చాడు, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

 Gunashekhar Shakuntalam Movie Not Going Well At Box Office , Rudrama Devi , An-TeluguStop.com

అయితే మరీ పరువు పోయేంతగా మాత్రం ఆ సినిమా కలెక్షన్స్ నమోదు అయ్యాయి అని మాత్రం చెప్పుకోవచ్చు.

Telugu Anushka, Guna Shekhar, Krishna Vamshi, Rudrama Devi, Samantha, Shaakuntal

గౌరవ ప్రధంగానే ఆ సినిమా కలెక్షన్స్ ను నమోదు చేయడం జరిగింది.ఇన్ని సంవత్సరాల తర్వాత దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా కలెక్షన్స్ చూస్తూ ఉంటే రుద్రమదేవి సినిమా కు నమోదు అయిన కలెక్షన్స్ చాలా బెటర్ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Telugu Anushka, Guna Shekhar, Krishna Vamshi, Rudrama Devi, Samantha, Shaakuntal

ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఒక దర్శకుడు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తే పెద్దగా బజ్ క్రియేట్ చేయడం కష్టమే… కానీ సమంత( Samantha ) ప్రధాన పాత్రలో నటించడంతో పాటు పౌరాణిక నేపథ్యం సినిమా అవడంతో మంచి క్రియేట్ అయింది.కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో దర్శకుడు గుణ శేఖర్‌ విఫలమయ్యాడు.ఒకప్పుడు మంచి సినిమాలు తెరకెక్కించిన గుణ శేఖర్‌ ప్రస్తుతం సక్సెస్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.ఇలాంటి దర్శకులు చాలా మంది ఉన్నారు.అందులో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరియు శ్రీనువైట్ల( Krishna Vamsi ) ముందుంటారు అనడంలో సందేహం లేదు.

Telugu Anushka, Guna Shekhar, Krishna Vamshi, Rudrama Devi, Samantha, Shaakuntal

ఇప్పుడు గుణశేఖర్ పరిస్థితి చూస్తుంటే ఆ ఇద్దరు దర్శకుడు మాదిరిగానే మెల్లగా సైడ్ అయిపోయే పరిస్థితి ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

దర్శకుడు గుణశేఖర్ నేల విడిచి సాము చేయడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని కొందరు బలంగా వాదిస్తున్నారు.గతంలో మాదిరిగా ఆయన మంచి కథలతో కమర్షియల్ సినిమాలను తీస్తే తప్పకుండా ప్రేక్షకుల ఆదరిస్తారని అభిప్రాయం అవుతుంది.

ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు గుణశేఖర్ ప్రయోగాలను పక్కన పెట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.మరి దర్శకుడు గుణశేఖర్ ఆ విధంగా ప్రయత్నిస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube