రాత్రి సమయంలో రామోజీ ఫిలిం సిటీ లో తెగ కష్టపడుతోన్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.గత సంవత్సర కాలం నుండి సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించకుండా దర్శకుడు కొరటాల శివ అభిమానులను నిరాశ పర్చుతూ వచ్చాడు.

 Ntr And Koratala Siva New Film Ntr30 Shooting Update , Ramoji Film City, Flim Ne-TeluguStop.com

ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ ప్రారంభమైంది.ఈనెల ఆరంభంలో మొదటి షెడ్యూల్ ప్రారంభించి వారం రోజుల పాటు హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో నైట్ షూట్ లో మరో భారీ యాక్షన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఎన్టీఆర్ ప్రతి రోజు తెల్లవార్లు ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడట.

అందుకే ఇటీవల ఆర్ఆర్ఆర్( RRR ) చిత్ర డిఓపి సెంథిల్‌ ఇచ్చిన పార్టీ కి హాజరు కాలేక పోయాడు.అయితే ఆ విషయమై మీడియా లో మాత్రం రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఎన్టీఆర్ యొక్క సినిమా ప్రస్తుతం అభిమానులకు మోస్ట్ వాంటెడ్ గా మారింది.కొరటాల శివ గత చిత్రం ఆచార్య( Acharya ) దారుణంగా నిరాశ పర్చిన కారణంగా ఈ సినిమాపై కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ను రూపొందిస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి.ఎన్టీఆర్ యొక్క బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన కథ ను కొరటాల శివ రూపొందించాడని ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా రామోజీ ఫిలిం సిటీలో( Ramoji Film City ) జరుగుతుందని తెలిసిందే.

వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ సినిమా ను ప్రేమికుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్ 2 అనే హిందీ సినిమా లో కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే.

జూన్ జూలైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తామని యూనిట్ సభ్యులు ప్రకటించారు.ఎన్టీఆర్ అతి త్వరలోనే ఆ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube