ఈ మధ్య కాలంలో వరుసగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలకు కమిట్ అవుతున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు కానీ వాటికి డేట్లు కేటాయించడం లేదు.
షూటింగ్ లో పాల్గొనడం లేదు అంటూ మొన్నటి వరకు విమర్శలు వ్యక్తం అయ్యాయి.కానీ గడిచిన నెల రోజులుగా పవన్ కళ్యాణ్ విరామం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.
జనసేన పార్టీ ( Janasena party )కార్యక్రమాలు పాల్గొంటూనే మరో వైపు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయితే తమిళంలో రూపొంది సక్సెస్ అయిన వినోదయ సీతం రీమేక్ షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఆ సినిమా విడుదలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఇక హరీష్ శంకర్ సినిమా మరియు సాహో సుజీత్( Sujeet ) దర్శకత్వంలో సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయనే విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ తన మొత్తం సినిమాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో కేవలం హైదరాబాద్ లోనే పూర్తి చేయిస్తున్నాడు.ఇండోర్ లేదా అవుట్ డోర్ సెట్స్ వేయించి షూటింగ్ చేస్తున్న దర్శకులు ఈసారి పవన్ కళ్యాణ్ ని ముంబై వరకు తీసుకు వెళ్లినట్టుగా తెలుస్తుంది.సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ జి సినిమా కోసం పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లాడు.ప్రస్తుతం ముంబై లో పవన్ లేకుండా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.
ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ ముంబైలోని చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది.ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
సాహో సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.అయినా కూడా దర్శకుడు సుజిత్ కి మంచి అవకాశం లభించింది.మరి ఈ అవకాశాన్ని ఆయన ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడు అనేది చూడాలి.