బడ్జెట్ ధరలో లావా బ్లేజ్ 2 మొబైల్ ఫోన్.. ఎప్పుడు విడుదల అవుతుందంటే..?

లావా మొబైల్స్( Lava ) తొలిసారి గా తమ లావా బ్లేజ్ 2( Lava Blaze 2 ) మొబైల్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ఏప్రిల్ 18వ తేదీ విడుదల చేయనుంది.అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ మొదలవుతుంది.ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ ర్యామ్, ఆకర్షనీయమైన డిజైన్, ఫాస్ట్ UFS 2.2 బిగ్ స్టోరేజ్ లతో బడ్జెట్ ధరలో కొనుగోలుదారులకు చేరువ అవ్వనుంది.సింగిల్ వేరియంట్ తో లాంచ్ చేయబడుతున్న లావా బ్లేజ్ 2 స్మార్ట్ ఫోన్ 6GB RAM, 12 GB RAM స్టోరేజ్ లతో రూ.8,999 బడ్జెట్ ధరతో రానుంది.

 Lava Blaze 2 Mobile Price And Specifications Details, Lava, Lava Mobiles, Lava B-TeluguStop.com

లావా బ్లేజ్ 2 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్( 90Hz Refresh Rate ) కలిగి 6.5 ఇంచ్ HD +(1600 * 720) రిజల్యూషన్ డిస్ప్లే కలిగి ఉంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పై పని చేస్తుంది.ఇందులో ఆటో కాల్ రికార్డ్ చేసే ప్రత్యేక ఫీచర్ కూడా ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T616 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా 6GB RAM మరియు 5GB వర్చువల్ ర్యామ్ ను కలిగి ఉంది.ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ టైప్ సి పోర్ట్ తో 18w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.ఇందులో 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ సైడ్ 13MP AI డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఫ్రెంట్ 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.మధ్యతరగతి కొనుగోలుదారులకు అందుబాటు ధరలో వస్తూ ఉండడంతో సేల్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube