ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.ఏపీలో అభివృద్ధి కోసం ప్రజల పక్షాన మాట్లాడా కానీ ఒక్క మాట కూడా అనలేదని తెలిపారు.
విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదాపై మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించానని మంత్రి హరీశ్ రావు అన్నారు.తాను అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఏపీ మంత్రులు తనపై ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు.
చేతనైతే విశాఖ ఉక్కుతో పాటు ప్రత్యేక హోదాపై పోరాడాలని హరీశ్ రావు సూచించారు.







