నేడు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి! అరెస్ట్ చేస్తారా ?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి( Y.S.Vivekananda Reddy ) హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది.ప్రస్తుతం ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది.

 Avinash Reddy For Cbi Investigation Today! Will You Be Arrested Ys Vivekanda Red-TeluguStop.com

ఇప్పటికే అనేక మందిని విచారించి అరెస్టులు చేశారు.నిన్ననే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డి( Bhaskar Reddy )ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు.వైఎస్ వివేకానంద రెడ్డి స్వయంగా జగన్ చిన్నాన్న కావడం,  మరో చిన్నాన్న ఈ కేసులో అరెస్టు కావడం, ఇప్పుడు కడప ఎంపీగా ఉన్న తన చిన్నాన్న భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి మెడకు ఈ కేసు చుట్టుకోవడం వంటివి జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.

  రాజకీయంగాను ఈ కేసు సంచలనంగా మారడం,  ప్రతిపక్షాలు ఇదే అంశంపై తను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తుండడంతో జగన్ సైతం ఆందోళనలోనే ఉన్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Cbi Enquiry, Kadapa Mp-Politics

ఇది ఇలా ఉంటే ఈరోజు సిబిఐ అధికారుల విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కాబోతున్నారు.ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సిబిఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి వెళ్లనున్నారు.  ఈ మేరకు ఈరోజు తెల్లవారుజామున పులివెందుల నుంచి హైదరాబాద్ కు భారీగా అనుచరులతో అవినాష్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.

Telugu Ap Cm Jagan, Ap, Cbi Enquiry, Kadapa Mp-Politics

ఆయన వెంట వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాదులోని సిబిఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు( Avinash Reddy ) హాజరవుతారు.నిన్ననే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం,  ఈరోజు అవినాష్ రెడ్డి ని విచారణకు పిలవడం వంటివి ఉత్కంఠ కలిగిస్తున్నాయి.విచారణ తర్వాత అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ఉత్కంఠ గా మారింది.

Telugu Ap Cm Jagan, Ap, Cbi Enquiry, Kadapa Mp-Politics

ఇక ఈ కేసులో సిబిఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోందని,  తాము లేవనెత్తిన అంశాలను సిబిఐ పట్టించుకోవడంలేదని వైఎస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖను కూడా పట్టించుకోలేదని,  వివేక మరణించిన సమయంలో పోలీసులకు తానే స్వయంగా సమాచారం ఇచ్చానని అవినాష్ రెడ్డి చెబుతున్నారు.ఈ హత్య గురించి వైఎస్ వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి కే విషయం తెలుసునని,  అయినా ఆయన పోలీసులకు చెప్పలేదని వివేకా రాసిన లేఖ తో పాటు ఆయన ఫోను కూడా దాచిపెట్టారని, అయినా సిబిఐ అధికారులు ఆ అంశాల జోలికి వెళ్లకుండా తమను మాత్రమే టార్గెట్ చేసుకున్నాయని అవినాష్ రెడ్డి విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube