స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగాక, వివిధ రకాల యాప్స్ వాడకం కూడా సహజంగానే పెరిగిపోయింది.ఈ క్రమంలో దేశంలోని ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లలో ( smart phones )ఎలాంటి యాప్స్ ఎక్కువగా వాడుతున్నారనే విషయంపై బాబుల్ ఏఐ ఒక నివేదికను విడుదల చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి.కంపెనీ దేశంలోని 8.5 కోట్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను విశ్లేషణ ఆధారంగా రిపోర్ట్ విడుదల చేసింది.తాజా విశ్లేషణ ప్రకారం భారతీయ పురుషులు ఎక్కువగా గేమింగ్ యాప్స్ వినియోగిస్తున్నారని తేలడం కొసమెరుపు.
ఇక ఆడవాళ్ల విషయానికొస్తే, ఫుడ్ మరియు మెసేజింగ్ యాప్స్ ఎక్కువగా వాడటానికి ఇష్టపడుతున్నట్టు తేలింది.ఇదే క్రమంలో దేశీయ స్మార్ట్‌ఫోన్‌లపై వినియోగదారులు వెచ్చిస్తున్న సమయం కూడా షాక్ కి గురి చేసింది.దేశంలోని 11.3 శాతం మంది మహిళలు మాత్రమే డిజిటల్ చెల్లింపుల కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించినట్లు తేలింది.అదే విధంగా 6.1 శాతం మంది మహిళలు మాత్రమే గేమింగ్ యాప్స్( Gaming apps ) వినియోగంలో క్రియాశీలంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇక ఇదే సమయంలో కమ్యూనికేషన్ యాప్స్( Communication apps ) వినియోగంలో 23.3 శాతం, వీడియో యాప్స్ 21.7 శాతం, ఫుడ్ యాప్స్ 23.5 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేశాయి.ప్రధానంగా ఎక్కువ మంది వీడియో కంటెంట్ క్రియేషన్ యాప్స్ కూడా వినియోగిస్తున్నట్టు తేలింది.
రిపోర్టును సిద్ధం చేసే క్రమంలో రీసెర్చ్ సంస్థ 2022, 2023లో మెుబైల్ వినియోగదారుల్లో వచ్చిన మార్పుల ట్రెండ్స్ ను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.వినోదం కోసం వీడియో యాప్స్, టేస్టీ మీల్స్ కోసం ఫుడ్ యాప్స్ అధికంగా వాడటంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు.