ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి( YS Bhaskar Reddy ) అరెస్ట్ కావటం సంచలనం సృష్టించింది.కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి( Avinash Reddy ) తండ్రి భాస్కర్ రెడ్డినీ ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు పులివెందులలో అరెస్టు చేయడం జరిగింది.
అయితే ఈ అరెస్టుపై అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాము చెప్పిన విషయంపై సీబీఐ విచారణ జరపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోపక్క వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేక హత్య కేసులో మరో 48 గంటల్లో ఇంకో అరెస్టు జరిగే అవకాశం ఉందని అన్నారు.భాస్కర రెడ్డి అరెస్టుతో సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) షాక్ కి గురై ఉంటారని.ఆయన ఈ కేసు పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని పేర్కొన్నారు.
నిజమైన దోషులు ఎవరన్నది సునీత రెడ్డికి తెలుసని వ్యాఖ్యానించారు.ఇదే పట్టుదలతో పోరాడి తండ్రి రుణం తీర్చుకోవాలని.
ఆమె పోరాటం మహిళా లోకానికి ఆదర్శమని రఘురామకృష్ణరాజు ప్రశంసించారు.







