కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారని చెప్పారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన అంశాలను సీబీఐ విస్మరిస్తోందని తెలిపారు.
చిన్న విషయాలను కూడా సీబీఐ సీరియస్ గా తీసుకుంటోందని అవినాశ్ రెడ్డి మండిపడ్డారు.
పాత సీబీఐ బృందం చేసిన విచారణనే కొత్త సీబీఐ బృందం ఫాలో అవుతోందని తెలిపారు.తాము చెప్పిన అంశాలను సీబీఐ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.







