సాధారణంగా మన మొబైల్‌కు ఫోన్ కాల్ వచ్చినా, లేదంటే అలారం మోగినా వాటి నోటిఫికేషన్లు( Notifications ) స్క్రీన్ మొత్తం ఆక్రమించేస్తుంటాయి.వీటివల్ల మొబైల్‌లోని ఇతర వాటిని యాక్సెస్ చేయడం కుదరదు.
ఇవి ముఖ్యమైన నోటిఫికేషన్లు అని తెలియజేయడానికే మొబైల్ ఫోన్స్ ఇలా నోటిఫికేషన్లను స్క్రీన్ అంతటా డిస్‌ప్లే చేస్తాయి.అయినా యూజర్లకు ఇది కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.
అందుకే ఆండ్రాయిడ్ 14 బీటాలో( Android 14 Beta ) ఫుల్ స్క్రీన్ నోటిఫికేషన్లను బ్లాక్ చేసే సరికొత్త ఫీచర్‌ను అందించారు.
ఆండ్రాయిడ్ 14 బీటా 1 రీసెంట్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఇందులో “స్పెషల్ యాప్ యాక్సెస్”( Special App Access ) సెట్టింగ్స్‌లో “ఫుల్ స్క్రీన్ ఇంటెంట్స్” మేనేజ్ చేయగల కొత్త ఆప్షన్ కనిపించింది.ఇది కాల్స్, అలారాలు, మీటింగ్ రిమైండర్‌ల కోసం ఫుల్-స్క్రీన్ వ్యూతో నోటిఫికేషన్లను ప్రదర్శించే సామర్థ్యాన్ని యాప్‌లకు అందించడానికి లేదా తిరస్కరించడానికి యూజర్లను అనుమతిస్తుంది.
ఆండ్రాయిడ్‌లో ‘ఫుల్ స్క్రీన్ ఇంటెంట్స్’ అనేది మొత్తం స్క్రీన్‌ను తీసుకునే నోటిఫికేషన్లను సూచిస్తుంది.

ఇది సాధారణంగా ఇన్‌కమింగ్ కాల్స్, అలారాలు, రిమైండర్‌ల వంటి ముఖ్యమైన అలర్ట్స్ కోసం ఉపయోగపడుతుంది.ఫుల్-స్క్రీన్ నోటిఫికేషన్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ అవుతుంది, అయితే వినియోగదారులు ఈ నోటిఫికేషన్‌లను నిలిపేయవచ్చు.అప్పుడు ఫోన్ కాల్స్ నోటిఫికేషన్లు కూడా చిన్న పరిమాణంలోనే కనిపిస్తాయి.
తద్వారా కాల్ వచ్చినప్పుడు ఫోన్‌లో ఇతర టాస్కులు చేయడం సులభంగా ఉంటుంది.

గూగుల్ గత వారం బీటా వెర్షన్‌ను విడుదల చేసింది, కానీ ఇది అస్థిరంగా ఉంది.ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో సమస్యలు, వాల్‌పేపర్ స్టైల్ యాప్‌తో క్రాష్‌లతో సహా అనేక సమస్యలను కలిగి ఉంది.యూజర్లు తమ డైలీ డ్రైవర్‌లో బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయకూడదని గూగుల్ ఇప్పటికే హెచ్చరించింది.
మరింత స్థిరమైన వెర్షన్ కోసం జూన్‌లో వరకు వెయిట్ చేయాలని సలహా ఇచ్చింది.







