ప్రముఖ నటి సమంత ( Samantha )నటించిన తాజా చిత్రం శాకుంతలం( Sakunthalam ) శుక్రవారం విడుదల అయిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది .సమంత శకుంతల పాత్రకి న్యాయం చేసిందనే చెప్పవచ్చు .
అయితే సొంత డబ్బింగ్ కొంత నెగిటివ్ అయిందనే చెప్పవచ్చు .ఇక ప్రేమకథ కంటే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నటిగా అనుభవం చూపించింది .దుశ్యంతుడుగా దేవ్ మోహన్( Dev Mohan ) .మేనకగా మధుబాల( Madhubala ) ఒకే అనిపించారు .దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబు( Mohan Babu ) కాసేపు కనిపించారు.కంచు కంఠంతో డైలాగులు చెబుతూ సన్నివేశాలకు ప్రాణం పోశారు.
అయితే సినిమాకు కొన్ని అంశాలు నెగిటివ్ గా మారాయి .శాకుంతలం సినిమా టూడీలో చూపిస్తేనే బావుండేది అనిపించక మానదు.ఎందుకంటేత్రీడీ వర్క్ ఘోరంగా ఉంది .విజువల్ ఎఫెక్ట్స్ త్రీడీ వర్క్గు ఏ మాత్రం సెట్ కాలేదు .
గుణశేఖర్( Gunasekhar ) తన ఊహని తెరపై అందంగా చూపించలేకపోయారు .గ్రీన్ మ్యాట్ మీద సినిమా తీసి విజువల్ ఎఫెక్ట్స్ చేయించడం అంత సులభం కాదు ఓ సన్నివేశంలో నటీనటులు స్పష్టంగా కనిపిస్తే.మరో సన్నివేశంలో చాలా చిన్నగా కనబడతారు.అలా చాలా మైనస్ లు ఉన్నాయి .అలాగే సన్నివేశాల్లో బలం లేదు.కథలో బలమైన సంఘర్షణ లేదు.
దేవ్ మోహన్, సమంత మధ్య కెమిస్ట్రీ కూడా కుదరలేదు ప్రేమకథలో, సన్నివేశాల్లో బలం కంటే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కుదిరితే సినిమా హిట్ అవుతుంది .ఇక్కడ అది కూడా లేదు.దాంతో సీరియల్ సాగినట్లు సన్నివేశాలు సాగాయి.రణభూమిలో యుద్ధ సన్నివేశాలు సైతం పేలవంగా సాగాయి.ఇక అందరికీ తెలిసిన కథను మళ్ళీ చెప్పడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం.
అందులోనూ ఎటువంటి మలుపులు లేని అభిజ్ఞాన శాకుంతలం కథను యథాతథంగా తీయాలనుకున్నప్పుడు… ప్రతి సన్నివేశం ఓ దృశ్యకావ్యం గా ఉండాలని ఆడియెన్స్ భావిస్తారు.గుణశేఖర్ వంటి దర్శకుడికి ఇవేవీ తెలియనివి కాదు అయితే ఆయన లెక్క తప్పింది.దేవ్ మోహన్ బదులు తెలుగు హీరో ఎవరినైనా తీసుకుని ఉంటే బావుండేది.
సమంత కంటే ఆయనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది.సమంతను చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఇదీ నచ్చకపోవచ్చు .అయితే మణిశర్మస్వరాలు మధ్య మధ్యలో మనసుకు ఊరట కలిగించాయి.ఆయన సంగీతం కాస్త స్వాంతన చేకూర్చింది.