టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) సాలిడ్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.ఈ నేపథ్యంలో ఈయన ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
ప్రస్తుతం గోపీచంద్ లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో పని చేస్తున్నాడు.గోపీచంద్ కెరీర్ లో ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ రేంజ్ లో మరో హిట్ అందుకోలేక పోయాడు.దీంతో ఈ రేంజ్ హిట్ కోసం గోపీచంద్ చాలానే కష్ట పడుతున్నాడు.
అందుకే ఈసారి చేసే సినిమా మంచి హిట్ అవ్వాలని పట్టుదలతో తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు.డైరెక్టర్ శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో ప్రజెంట్ ”రామబాణం” (Ramabanam) సినిమాను చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆడియెన్స్ ను అలరించాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ ను రిలీజ్ చేసారు.”దరువేయ్ రా” అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ను కర్నూల్ లో నిన్న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.ఈ మాస్ బీట్ సాంగ్ కు మంచి ఆదరణ లభిస్తుంది.
మరి ఈ ఈవెంట్ లో అక్కడి ఫ్యాన్స్ తో గోపీచంద్ మాట్లాడారు.

ఈ సినిమా కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని.గతంలో తాను పలు సినిమాల కోసం కర్నూల్ వచ్చానని అవి అన్ని సక్సెస్ అయ్యాయని.అలానే రామబాణం కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం గోపీచంద్ వ్యక్తం చేసారు.
లక్ష్యం, లౌక్యం మాదిరిగా ఈ సినిమా కూడా మా కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ గా నిలుస్తుందని అన్నారు.మరి గోపీచంద్ అన్నట్టు ఈ సినిమా విజయం అందుకుంటుందో లేదో చూడాలి.
రామబాణం సినిమాను మే 5న సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తుండగా.
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.డింపుల్ హయతి (Dimple Hayati) హీరోయిన్ గా నటిస్తుంది.







