రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరగగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్యలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మొక్కలు నాటి హైదరాబాదులో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మండల ప్రజా ప్రతినిధుల తో కలిసి ఎంపీపీ జడ్పిటిసిలు తరలి వెళ్ళారు.

 Everyone Should Work Hard To Achieve The Dream Of Constitution Maker Dr. Babasah-TeluguStop.com

ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పిటిసి కత్తెరపాక ఉమ కొండయ్యలు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అని కొనియాడారు.బడుగు బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో, వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నరేష్ ,ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి ,మండల పంచాయతీ అధికారి గంగ తిలక్ ,బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తేరపాక కొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బి.ఆర్.ఎస్ నాయకులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube