రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సుంకి భాస్కర్ అనే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చింతల్ టాన గ్రామంలో వాత్సల్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేయగా అందులో పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం నాకు సంతోషం గా ఉందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇంకొకరికి ఆయువు ఆయన అన్నారు.
రక్తదానం చేసిన భాస్కర్ ను ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ గ్రామస్తులు అభినందించారు.