Akira Nandan Pawan Kalyan :అకీరా విషయం లో ఇంత గొడవ అవసరమా ? హీరో కొడుకు అయితే ఏంటి ?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ అభిమానులంతా తీవ్ర నిరాశలో, దుఃఖ సాగరం లో ఉన్నట్టుగా ఎన్నో వార్తలు గత రెండు రోజుల నుంచి వడ్డించబడుతున్నాయి.కారణం ఏంట్రా అని ఆరా తీస్తే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్( Akira Nandan ) సినిమాల్లో వస్తాడు అనుకుంటే ఒక షేర్ ఫిలిం కి సంగీతం అందించి సంగీత దర్శకుడు అయిపోవడం అంట.

 Akira Nandan Pawan Kalyan :అకీరా విషయం లో ఇంత గ-TeluguStop.com

ఈ న్యూస్ చదవడానికి కాస్త వింతగా ఉంది .ఎందుకంటే మెగా అభిమానులు అంతా పవన్ కళ్యాణ్ కొడుకు పవన్ కన్నా పెద్ద హీరో అవ్వాలని చాల రోజులుగా ఎదురు చూస్తున్నారు.ఆ వార్త ఎప్పుడు వింటామా అని చెవులు నిక్కబెట్టుకోం ఎదురు చూసారు.

Telugu Akira Nandan, Pawan Kalyan, Renu Desai, Tollywood-General-Telugu

కానీ వారు ఊహించింది జరగకపోగా తెరవెనక ఉండే ఈ పని ఎందుకు చేయడం అన్నట్టుగా వారి కామెంట్స్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది.ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటి అంటే హీరో కొడుకు అయినంత మాత్రాన హీరోనే కావాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని.అకీరా నందన్ తండ్రి చాటు బిడ్డ కాదు.తల్లి చేతి బిడ్డ, రేణు దేశాయ్( Renu Desai ) అతడిని చాల చక్కగా పెంచి పెద్ద చేసింది.

Telugu Akira Nandan, Pawan Kalyan, Renu Desai, Tollywood-General-Telugu

అతడికి ఎలా ఉండాలి అనుకుంటే ఆలా ఉండే స్వతంత్రం ఇచ్చింది.అందుకు ఎవరి పర్మిషన్ తో అతడికి పని లేదు.రాజాకీయ నాయకుడి కొడుకు రాజకీయాల్లోకి రావాలి, హీరో కొడుకు నటించాలి అంటే ఎలా కుదురుతుంది.

అసలు మెగా ఫ్యామిలీ అంటేనే హీరోల ఉత్పత్తి కేంద్రం అన్నట్టుగా తయారయ్యింది కానీ అకీరా ఏదైనా చేయాలి అనుకుంటే ఎవరు ఆపిన అది ఆగడు.

Telugu Akira Nandan, Pawan Kalyan, Renu Desai, Tollywood-General-Telugu

తనకు ఏం కావాలో తాను ఆలోచించుకోగలడు.ఇక మొన్నెప్పుడో అకిరా గ్రాడ్యుయేషన్ సెర్మనీ లో అకీరా నందన్ కొణిదెల అని కాకుండా అకీరా నందన్ దేశాయ్ అని వేశారని పవన్ ఫ్యాన్స్ నానా రచ్చ చేసారు.నిజానికి అకిరా తల్లిని బాగా ఓన్ చేసుకున్నాడు.

తన తల్లి రేణు కి పవన్ ఫ్యాన్స్ అంటే చాల భయం కూడా ఉంది.ఆమెపై ఎన్ని నిందలు వేసిన పవన్ కళ్యాణ్ ఈనాడు వారించలేదు.

ప్రేమ దోమ అని చెప్పి పిల్లల తల్లిని చేసాక పెళ్లి చేసుకొని ఆ బంధం కూడా నిలుపుకోలేక మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని తండ్రి అంటూ అకీరా ఎందుకు ఓన్ చేసుకోవాలి .మీరే సమాధానం చెప్పండి.చిన్నతనం నుంచి అకీరా అన్ని చూసి ఉంటాడు కుటుంబం లో .!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube