సాధారణంగా ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలలో నటిస్తే వారి మధ్య ఏదో ఉంది అనే పుకార్లు పుట్టడం సర్వసాధారణం.ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి రూమర్స్ ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతుంటారు.
కొందరు ఇలాంటి రూమర్స్ పై స్పందించి వాటిని ఖండిస్తూ ఉంటారు.అయితే తాజాగా పూజా హెగ్డే( Pooja Hedge ) సైతం ఈ విధమైనటువంటి రూమర్లపై స్పందించారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న పూజ హెగ్డే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan )తో డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇలా వీరిద్దరి గురించి గత కొద్దిరోజులుగా డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే తాజాగా కిసి కా భాయ్ కిసి కా జాన్( Kisi Ka Bhai Kisi Ki Jaan ) అనే సినిమాలో నటించారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ తో పూజ హెగ్డే డేటింగ్ లో ఉన్నారు అనే రూమర్లపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే డేటింగ్ రూమర్లపై స్పందించిన పూజ హెగ్డే నేను దాని గురించి ఏం చెప్పగలను… నేను నా గురించి ఇలాంటి వార్తలు గత కొద్దిరోజులుగా చదువుతూనే ఉన్నాను.ప్రస్తుతం నాతో నేను ప్రేమలో ఉన్నాను.

తాను మనస్ఫూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టానని తెలిపారు.ప్రస్తుతం నేను వరుస సినిమాలలో నటించడం వల్ల ఒక సిటీ నుంచి మరొక సిటీకి ప్రయాణం చేస్తూ ఉన్నాను ఇలాంటి సమయంలో తాను కూర్చుని సమాధానం చెప్పలేను అంటూ కొంత పాటి అసహనం వ్యక్తం చేశారు.ఇలా పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ డేటింగ్ రూమర్ల గురించి ఇలా స్పందించడంతో ఇవన్నీ అవాసవాలేనని ఈమె చెప్పకనే చెప్పేశారు.
ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







