తెలుగు సినీ ప్రేక్షకులకు నటి నమిత( Actress Namita ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నమిత తెలుగులో జెమినీ, బిల్లా,సింహా,సొంతం, ఒక రాజు ఒక రాణి లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
సింహా సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.ఈమె నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది నమిత.
ఇకపోతే నమిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ నమిత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది.బీజేపీని( BJP ) ట్యాగ్ చేస్తూ ఆ వీడియోలో ఈ విధంగా చెప్పుకొచ్చింది.మామూలుగా కొత్త సంవత్సరం రోజున జనవరి ఒకటవ తేదీన మనం స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్( New Year Celebrations ) చేసుకుంటూ ఉంటాం.

స్నేహితులతో ఫ్యామిలీతో కలిసి డాన్సులు చిందులు వేస్తూ ఉంటాం.కానీ అది మన సంస్కృతి కాదు.మనకంటూ ఒక సంస్కృతి ఉంది.
చిత్తిరై మాసం మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన మన ఉగాది.( Ugadi ) అదే మనకు కొత్త సంవత్సరాది.

ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.ఆలయాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఇష్టదైవాన్ని ప్రార్థిద్దాం.ప్రతి ఒక్కరికీ తమిళ నూతన ఉగాది శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది నమిత.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.







