టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇద్దరిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ మేరకు లౌకిక్, సుస్మితలను మూడు రోజుల కస్టడీకి అనుమతిని ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
లౌకిక్, సుస్మితలు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉండగా కోర్టు అనుమతి నేపథ్యంలో కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు.







