Raghava Lawrence : అనారోగ్యంపాలైన నిర్మాతకు ఆర్థిక సాయం చేసిన హీరో లారెన్స్.. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్!

తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ హీరో, నటుడు నృత్య దర్శకుడు అయిన రాఘవ లారెన్స్( Raghava Lawrence ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాఘవ లారెన్స్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేసి సినిమా కాంచన( Movie Kanchana).

 Raghava Lawrence Financial Help Tamil Producer Va Durai-TeluguStop.com

కాంచన సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్నాడు రాఘవ.కాగా హీరో రాఘవ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి సహాయం చేసి హీరో అనిపించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అంతేకాకుండా సహాయం చేయడంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో హీరో రాఘవ ఎప్పుడు ముందు ఉంటారన్న విషయం తెలిసిందే.

Telugu Financial, Kanchana, Rajinikanth, Surya Vikram, Tamil Va Durai-Movie

ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్న రాఘవ తాజాగా కూడా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక నిర్మాతకు ఆర్థిక సహాయాన్ని చేసి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు.తమిళ నిర్మాత విఏ.దురై( Tamil producer VA Durai ) గురించి మనందరికీ తెలిసిందే.హీరో సూర్య విక్రమ్( Surya Vikram) కలిసి నటించిన పితామహన్ వంటి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు.అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన గజేంద్ర లాంటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విఏ.దురై, చివరగా నిర్మించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో నష్టాల బారిన పడ్డారు.

Telugu Financial, Kanchana, Rajinikanth, Surya Vikram, Tamil Va Durai-Movie

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పడగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు.ప్రస్తుతం చెన్నైలోనే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.వైద్యం చేయించుకోవడానికి కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేవని ఆవేదన చెందుతూ ఒక వీడియోని విడుదల చేశారు.ఆ వీడియోలో హీరో రజనీకాంత్( Rajinikanth ) కూడా తనకు సహాయం చేస్తానని చెప్పారు అని తెలిపారు విఏ.దురై.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాఘవ లారెన్స్ నిర్మాత పరిస్థితిని గమనించి వెంటనే ఇది ఖర్చుల కోసం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేశారు.

రాఘవ లారెన్స్ చేసిన పనికి అభిమానులు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ తాజాగా నటించిన చిత్రం రుద్రన్.ఈ సినిమా రుద్రుడు పేరుతో తెలుగులో నేడు అనగా ఏప్రిల్ 14వ తేదీ విడుదలైన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube