నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో ఉద్యమం చేపట్టనున్నారు.ఈ మేరకు ప్రజా సమస్యలపై రేపటి నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్లను కేటాయించినందుకు ప్రభుత్వానికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.అయితే ఇది తన విజయం కాదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు ముస్లిం సోదరుల విజయమని చెప్పారు.అనంతరం నియోజకవర్గంలో ఉన్న అపరిష్కృత సమస్యలకు నిధులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.







