పుష్ప 2 స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చేసిన సమంత... ఏమన్నారంటే? ఇచ్చేసిన

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా (Shaakuntalam) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది.

 Samantha Gave Clarity On Pushpa 2 Special Song Details, Samantha,pushpa 2,shaaku-TeluguStop.com

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ అనేక విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే పుష్ప 2 (Pushpa 2)సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి సమంత(Samantha) స్పందించారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మాత్రం సమంత చేసిన విషయం మనకు తెలిసిందే.ఉ అంటావా మామ ఊ.ఊ అంటావా మామ అనే పాట ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఈ పాట ద్వారా సమంత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఇందులో కూడా సమంతనే చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఈ విషయం గురించి సమంతను ప్రశ్నించగా ఈమె మాట్లాడుతూ మీరు అనుకున్నట్టు తాను ఎలాంటి స్పెషల్ సాంగ్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చేశారు.ఇలా సమంత పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయట్లేదు అని చెప్పడంతో అభిమానులు కొంతమేర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube