ఏపీలో ఎన్నికలకు 15 నెలల సమయం మాత్రమే ఉంది.దాంతో అన్నీ ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజామద్దతు కొరకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.కాగా ఈసారి ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు కూడా ఎంతో కీలకం.
భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోమారు అధికారంలోకి రావాలని చూస్తున్న వైసీపీ ( YCP )ఒకవైపు, డూ ఆర్ డై గా గెలుపుకోసం టీడీపీ( TDP ) మరోవైపు.ఈసారైనా సత్తా చాటలని చూస్తున్న జనసేన( Janasena ) ఇంకోవైపు.
ఇలా మూడు పార్టీలకు కూడా ఈ ఎన్నికలు ఎంతో కీలకమే.

అయితే మిగిలిన పార్టీల విషయాన్ని కాస్త పక్కన పెడితే.ఈసారి ఎన్నికలో గెలవడం జనసేన పార్టీకి మరింత అవసరం.పార్టీ స్టాపించి పదేళ్ళు పూర్తయిన ఇంతవరకు క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా జనసేన ఇంకా తడబడుతూనే ఉంది.2014 ఎన్నికల్లో టీడీపీ, బిజెపి కి కేవలం మద్దతుగానే నిలిచిన పవన్.2019 ఎన్నికల్లో మాత్రం ప్రత్యేక్షంగా బరిలోకి దిగి ఘోరంగా చేతులు కాల్చుకున్నారు.స్వయంగా పార్టీ అధినేత రెండు చోట్ల ఓడిపోవడం అనేది జనసేన ఘోర పరాభవానికి నిదర్శనం.బలమైన ప్రజాదారణ, అభిమానుల సంఖ్య ఉన్న పవన్ ఓడిపోవడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయమే.

అయితే 2019 ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని ఎదుర్కొని, అప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో పార్టీకి బలం పెంచే పనిలో నిమగ్నమై, ఆ కోవలో సక్సస్ అయ్యారు పవన్.ప్రస్తుతం జనసేన గ్రాఫ్ ఏపీలో మెరుగ్గానే ఉంది.ప్రజలు కూడా పవన్ పై సానుకూల దృక్పథంతోనే ఉండడం జనసేనకు కలిసొచ్చే అంశం.అయితే పవన్ పై ప్రజలు చూపిస్తున్న అభిమానం ఓట్లుగా మారడం లేదనేది జగమెరిగిన సత్యం.
ఈ విషయాపై స్వయంగా పవనే చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు కూడా.అందువల్ల 2019 ఎన్నికల్లో ఎదుర్కొన్నా పరాభవం 2024లో కూడా రిపీట్ అయితే జనసేన పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది.
మరి పవన్ కు ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెట్టె అవకాశం వస్తోందో రాదో చూడాలి.







