అమెరికాలోని వెస్ట్ టెక్సాస్‌లోని( West Texas, USA ) ఒక డైరీ ఫామ్‌లో తాజాగా భారీ పేలుడు సంభవించింది.మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో 18,000 ఆవులు చనిపోయాయి.
ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ పశువులు చనిపోలేదని, ఇదే అమెరికాలో అతి పెద్దదని నివేదికలు పేర్కొన్నారు.టెక్సాస్‌లోని డిమిట్‌లోని సౌత్ ఫోర్క్ డైరీ ఫామ్‌లో ( South Fork Dairy Farm in Dimmitt ) ఈ పేలుడు సంభవించింది.
నల్లటి పొగతో కూడిన భారీ మేఘాలు గంటల తరబడి డైరీ ఫామ్ ప్రాంతాన్ని కమ్మేశాయి.అయితే మనుషులకు ఎటువంటి ప్రాణనష్టం ఏర్పడలేదు.
కానీ ఒక డెయిరీ ఫామ్ కార్మికుడిని అధికారులు రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.తొలుత కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కోలుకున్నాడు.
అగ్నిమాపక అధికారులు గంటల పాటు శ్రమించి ఆ ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

విషాదకరమైన అగ్నిప్రమాదం తర్వాత 18,000 పశువులు చనిపోయాయని అధికారులు పేర్కొన్నారు.అమెరికాలో ప్రతిరోజూ వధించబడుతున్న ఆవుల మొత్తం కంటే ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు ఎక్కువ.మంటల్లో మరణించిన ఆవులు హోల్‌స్టెయిన్, జెర్సీ ( Holstein, Jersey )ఆవుల మిశ్రమం.
డెయిరీ ఫారంలోని మొత్తం మందలో దాదాపు 90 శాతం చనిపోయాయి.టెక్సాస్ అగ్నిమాపక అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు పేలుడుకు కారణం అస్పష్టంగా ఉంది.
ఆవుల నుంచి పాలు పితకడానికి వేచి ఉన్ సందర్భంలో పేలుడు సంభవించిందని, దీంతో భారీ సంఖ్యలో ఆవులు చనిపోయినట్లు భావిస్తున్నారు.ఒక్కో ఆవు విలువ 2 వేల యూఎస్ డాలర్లు.
ఒకేసారి 18 వేల ఆవులు చనిపోవడంతో డెయిరీ ఫారం యజమానికి సౌత్ ఫోర్క్ డైరీ ఫామ్ కాస్ట్రో కౌంటీలో ఉంది.ఇది టెక్సాస్ రాష్ట్రంలో అత్యధిక పాలు ఉత్పత్తి చేసే కౌంటీలలో ఒకటి.
టెక్సాస్ 2021 వార్షిక డైరీ ప్రకారం, క్యాస్ట్రో కౌంటీలో 30,000 కంటే ఎక్కువ పశువులు ఉన్నాయి.







