వైరల్: మెట్రో యువతి ఈసారి యువకుడితో చిందులేసింది చూడండి!

సోషల్ మీడియా నేడు యువతని ఎంతలా ప్రభావితం చేస్తోందో ప్రత్యేకించి ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఇపుడు ప్రపంచాన్ని శాసిస్తోందని చెప్పుకోవాలి.

 Viral Metro Young Woman Is Spilled With A Young Man This Time ,metro Girl , Danc-TeluguStop.com

నేడు దీని ద్వారా ఎంతోమంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారిన పరిస్థితిని చూస్తున్నాం.ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా దీనిద్వారానే త్వరగా బయటకు తెలుస్తోంది.

అంతెందుకు మనీ సంపాదనకు కూడా ఓ మార్గం చూపిస్తూ ప్రత్యేకంగా యవతను తనవైపు తిప్పుకుంది సోషల్ మీడియా అనడంలో సందేహమే లేదు.

ఇకపోతే భారతదేశంలో టిక్‌టాక్ నిషేధం తర్వాత, నెటిజన్లు ఇప్పుడు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను, యూట్యూబ్ ని ఆశ్రయిస్తున్నారు.ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శించడం నుంచి అనేక ఫన్నీ వీడియోలు, డ్యాన్స్‌లు… ఇలా ఒక్కటేమిటి తమ టాలెంట్ ని ప్రదర్శించే విషయం ఏదైనా వారు ముందడుగు వేస్తున్నారు.వందమంది జనాలు చుట్టూతా వున్నా తమని ఆపేవాడే లేదంటూ తెగ రెచ్చిపోయి డాన్సులు చేస్తున్నారు.

ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇటీవల చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసి హల్‌చల్ చేసిన అవ్నీకరీశ్ తాజాగా మరో డాన్స్‌ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.కాగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.వృత్తిరీత్యా డ్యాన్సర్‌గా చెప్పుకునే అవ్నీకరీశ్‌ ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో భోజ్‌పురి పాట సాజ్ కే సవార్ కేకు తన నిర్మొహమాటంగా డ్యాన్స్ చేసి అందరి దృష్టిని చాలా తీవ్రంగా ఆకర్షించింది.

ఇకపోతే పబ్లిక్‌గా డ్యాన్స్ చేయడం ఆమెకు కొత్తేమీ కాదు.తాజాగా ఈ యువతి నలుపు రంగు లెహంగా ధరించి, తన డ్యాన్స్ పార్ట్‌నర్‌తో సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన హలో బ్రదర్‌లోని తేరి చున్నారియా పాటకు స్టెప్పులేసింది.

ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube