ప్రఖ్యాత వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్( Youtube ) అంటే ఏమిటో తెలియని జనాలు దాదాపుగా వుండరు.ఇక్కడ స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరూ మొదటగా వాడేది యూట్యూబ్ అని సర్వేలు చెబుతున్నాయి.
అంతెందుకు మనం కూడా మన ఫోన్ లో మొదటగా ఓపెన్ చేసేది యూట్యూబే.ఎందుకంటే ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఎడ్యుకేషనల్ వీడియోల వరకు అన్నీ ఫ్రీగా చూసుకొనే వెసులుబాటు ఉంటుంది కనుక.
అపారమైన వీడియో కంటెంట్‌తో పాటు యూట్యూబ్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది కూడా.
ఈ క్రమంలోనే తాజాగా ప్రీమియం యూజర్లకు 5 అదిరిపోయే ఫీచర్లను లాంచ్ చేసింది.ఇంతకుముందు పెయిడ్ యూజర్లకు యాడ్ ఫ్రీ మ్యూజిక్( Ad free music ), బ్యాక్‌గ్రౌండ్ ప్లే వంటి ముఖ్య ఫీచర్లు అందుబాటులో ఉండేవి.ఇప్పుడు ఆ రెండు ఫీచర్లతో పాటు మరో 5 ఫీచర్లు కూడా జత అయ్యాయి.
వీటితో స్నేహితులతో కలిసి వీడియోలను చూసుకోవచ్చు.డివైజ్‌లలో వీడియో ప్లేబ్యాక్‌ని సింక్ చేయవచ్చు.
మెరుగైన 1080pలో వీడియోలను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.ప్రీమియం మెంబర్స్‌కి మరింత హై క్వాలిటీ వీడియో ఎక్స్‌పీరియన్స్ అందించడానికి.
iOSలో 1080p HD వీడియో క్వాలిటీని అందించనుంది.
యూట్యూబ్‌లో ఏదైనా వీడియోని చూస్తూ చూస్తూ మధ్యలో వదిలేస్తే మళ్లీ దానిని అదే సమయం నుంచి చూసుకొనే వెసులుబాటు ఉంటుంది.అయితే వేరే డివైజ్‌కి మారితే మాత్రం మొదటినుంచి చూడాల్సి వస్తుంది.ఇపుడు ప్రీమియం ఫీచర్‌తో ఒకే అకౌంట్‌కి లాగిన్ అయిన ఏ డివైజ్‌లనైనా ఆపిన వద్ద నుంచే స్టార్ట్ చేయవచ్చు.
యూట్యూబ్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో వీడియోలను క్యూలో ఉంచే ఫీచర్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాగా ఇప్పుడు మొబైల్ ప్రీమియం యూజర్లకు లాంచ్ అయ్యింది.దాంతో ఇప్పుడు ఫోన్లు, టాబ్లెట్లు రెండింటిలోనూ నచ్చిన వీడియోలను క్యూలో యాడ్ చేసుకోవచ్చు.
మీరు స్నేహితులు, కుటుంబం లేదా సహోద్యోగులతో కలిసి యూట్యూబ్‌లో వీడియోలను చూడాలనుకుంటే, యూట్యూబ్ మీట్ లైవ్ షేరింగ్ ఫీచర్ వినియోగిస్తే సరిపోతుంది.