విజయ్ దేవరకొండ టాక్సీవాలా మూవీని మిస్ చేసుకున్న యంగ్ హీరో ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండకు( Vijay Devarakonda ) ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే.వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో విజయ్ దేవరకొండ కెరీర్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Shocking Facts About Vijay Devarakonda Taxiwala Movie Sudhakar Komakula Details,-TeluguStop.com

విజయ్ దేవరకొండ కెరీర్ లోని హిట్ సినిమాలో టాక్సీవాలా సినిమా( Taxiwala ) కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

సినిమా రిలీజ్ కు ముందే పైరసీ బారిన పడిన ఈ సినిమా విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.అయితే ప్రముఖ నటుడు సుధాకర్ కోమాకుల( Sudhakar Komakula ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదని అనిపించిందని ఆయన అన్నారు.ఒక బ్రదర్ యూఎస్ లో ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నారని సుధాకర్ కామెంట్లు చేశారు.

విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ కు బదులుగా షేర్ తీసుకుని సినిమాల కోసం పని చేశాడని ఆయన అన్నారు.పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలకు విజయ్ అలానే పని చేశారని చిన్న సినిమాలకు ఇలా చేయడం వర్కౌట్ అవుతుందని సుధాకర్ కోమాకుల చెప్పుకొచ్చారు.అందరూ ప్రాణం పెట్టి చేస్తే వర్కౌట్ అవుతుందని ఆయన తెలిపారు.నా వైఫ్ కు చిరంజీవి అంటే అభిమానమని సుధాకర్ చెప్పుకొచ్చారు.

టాక్సీవాలా సినిమాను నేను మిస్ చేసుకున్నానని సుధాకర్ పరోక్షంగా తెలిపారు.ట్యాక్సీవాలా సినిమా కథను నేను ఎప్పుడో విన్నానని ఆ సమయంలో సమస్యలు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.నేను కథ విన్న సమయంలో ఆ సినిమాకు నిర్మాతలు లేరని సుధాకర్ చెప్పుకొచ్చారు.ఒకవేళ టాక్సీవాలా సినిమాలో నటించి ఉంటే మాత్రం సుధాకర్ కెరీర్ పరంగా బిజీగా ఉండేవారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube