చీమలపాడు బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన దుర్ఘటనలో మృతిచెందిన అంగోతు మంగు కుటుంబ సభ్యులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.ప్రమాదంలో తమ తండ్రిని కోల్పోయి ఒక రోజు గడిచినా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ ఏ విధమైన సహాయం అందలేదని జనసేన ద్వారా తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుని కుమారులు ఉమేష్, గణేష్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థించారు.

 Pawan Kalyan Spoke To The Family Of The Cheemalapadu Victim On The Phone , Paw-TeluguStop.com

తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.జరిగిన సంఘటన చాలా బాధకరమని, కుటుంబ పెద్దను కోల్పోతే కలిగే బాధను అర్థం చేసుకోగలనని, బాధిత కుటుంబాలు అందరికీ న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.

సంఘటన జరిగిన చీమలపాడు ప్రాంతాన్ని జనసేన తెలంగాణ రాష్ట్ర బాధ్యులు శ్రీ నేమూరి శంకర్ గౌడ్ , రాష్ట్ర నాయకులు శ్రీ తాళ్ళూరి రామ్ ,శ్రీ రాధారం రాజలింగం సందర్శించిన అనంతరం మరణించిన వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.నాయకులు శ్రీమతి కావ్య, శిరీష, రామకృష్ణ, రవీందర్, రాజేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube