ఆ ఇద్దరు బీఆర్‌ఎస్‌ బహిషృత నేతల దారి ఎటు?

తెలంగాణ అధికార బీఆర్ఎస్ పార్టీ ( BRS party )నుండి పొంగులేటి శ్రీనివాస్‌, జూపల్లి కృష్ణారావు లను సస్పెండ్‌ చేస్తూ అధికారికంగా ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.ఆ ఇద్దరు ముఖ్య నాయకులు గత కొన్నాళ్లుగా పార్టీ లో ఉన్నట్లే ఉన్నా.

 Ponguleti And Jupally Which Party Join ,ponguleti Srinivasa Reddy , Brs , Kcr-TeluguStop.com

లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతో వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లుగా పార్టీ అధినాయకత్వం ప్రకటించిన విషయం తెల్సిందే.

Telugu Congress, Jupally, Khammam, Ponguleti, Ts-Politics

ఖమ్మం జిల్లా మొత్తం తాను చెప్పినట్లుగా వింటుందని చెప్పుకుంటున్న పొంగులేటి( Ponguleti Srinivasa Reddy ) ఇటీవల మీడియా ముందు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీకి పోకుండా చూస్తానంటే సవాలు విసిరాడు.అంతే కాకుండా పొంగులేటి బీఆర్ఎస్( Brs party ) పార్టీని గద్దె దించేందుకు ఎంత దూరమైనా వెళ్తాం అంటూ సవాల్ విసిరారు.

Telugu Congress, Jupally, Khammam, Ponguleti, Ts-Politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపిలో జాయిన్ అవుతాడా లేదంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆ మధ్య షర్మిల పార్టీ లో జాయిన్ అయ్యేందుకు కూడా చర్చలు జరపడం జరిగింది అనే వార్తలు వచ్చాయి.అయితే బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే పొంగులేటి జాయిన్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.ఆయన్ను బీజేపీ( BJP )లో జాయిన్‌ అయ్యేలా ఒప్పించేందుకు ఎమ్మెల్యే బీజేపీ ముఖ్య నాయకుడు ఈటల రాజేందర్ చర్చలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

Telugu Congress, Jupally, Khammam, Ponguleti, Ts-Politics

పొంగులేటి ఏ పార్టీలో జాయిన్ అయితే జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) కూడా అదే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.దేశ వ్యాప్తంగా బిజెపి పవనాలు వీస్తున్న ఈ సమయంలో బిజెపి వైపే వారు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతుంది.మొత్తానికి దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే రాష్ట్రంలో జూపల్లి కృష్ణారావు పొంగులేటి ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారని ఆసక్తి పై విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube