తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ప్రజలను మభ్య పెట్టడంలో కేసీఆర్ ను మించినోడు లేరని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన నీటిని దొంగిలించి మల్లన్న సాగర్ కు తరలిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.ఎస్సీ సబ్ ప్లాన్ పథకం పేరు మార్చి నిధులు మళ్లించారని పేర్కొన్నారు.
కేసీఆర్ ను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని జీవన్ రెడ్డి వెల్లడించారు.