సాధారణంగా ప్రతి ఒక్కరు తమ ఇండ్లలో పెట్ డాగ్స్( Pet Dog s) పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.ముఖ్యంగా సెలబ్రిటీలు ఎంతో ఖరీదైన పెద్ద డాగ్స్ కొనుగోలు చేసి వాటిని తమ సొంత మనుషులు లాగా చూసుకుంటూ ఉంటారు.
అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జంతువులు అంటే చాలా ఇష్టం అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఉపాసన పెట్ రైమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మెగా కుటుంబ సభ్యులు ఈ పెట్ ను తమ కుటుంబ సభ్యులుగా భావించి చూసుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన (Upasana) విదేశాలకు వెళ్లిన తమ వెంట ఈ పెట్ ను తీసుకొని వెళ్తూ ఉంటారు.ఇక రైమ్ (Rhyme ) కి కూడా ఎంతో ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
దీనికి ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండడమే కాకుండా దాదాపు 50 వేలకు పైగా ఫాలోవర్స్ కూడా ఉండడం విశేషం.
ఇలా తరచూ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ పెట్ రైమ్ తో కలిసి సరదాగా గడుపుతూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.


ఇకపోతే వీటి దగ్గర ఉన్నటువంటి ఈ రైమ్ కొనుగోలు చేయడానికి ఎంత ధర పడుతుంది ఏంటి అనే విషయానికి వస్తే రాంచరణ్ ఉపాసన దంపతుల వద్ద ఉన్నటువంటి రైమ్ ధర రూ.35,000, రూ.70,000 మధ్య ఉంటుందనీ తెలుస్తుంది.ఇలా ఈ జాతికి చెందిన పెట్ డాగ్స్ కొనుగోలు చేయాలి అంటే ఈ రేంజ్ లో ఖర్చు చేయాలని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు మాల్దీవ్ వెకేషన్ నుంచి రాగానే ఎయిర్ పోర్టులో రైమ్ చేసిన హంగామా మామూలుగా లేదు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








